HomeLATESTఐఐటీల్లో ఎంటెక్​ అడ్మిషన్స్​కు ‘గేట్​’ నోటిఫికేషన్ రిలీజ్​

ఐఐటీల్లో ఎంటెక్​ అడ్మిషన్స్​కు ‘గేట్​’ నోటిఫికేషన్ రిలీజ్​

దేశంలోని ఐఐటీలు, ఇతర సంస్థల్లో ఎంటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే ‘గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)-–2025’ పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో జరగనున్నాయి. మొత్తం 30 సబ్జెక్టుల్లో పరీక్షలు జరగనున్నాయి. ఈసారి ఆన్‌లైన్‌ పరీక్షల నిర్వహణ బాధ్యత ఐఐటీ రూర్కీ చేపట్టింది.

గేట్​ బెనిఫిట్స్​ గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్‌ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ(బీఏ, బీకాం, బీఎస్‌సీ) పోటీపడవచ్చు. ఈ స్కోర్‌ ద్వారా ఎంటెక్‌లో చేరితే నెలకు రూ.12,400ల చొప్పున స్కాలర్‌షిప్‌ అందజేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ స్కోర్‌ ఉన్నవాళ్లకు ప్రవేశాల్లో తొలి ప్రాధాన్యం ఇస్తారు. ఐఐటీలు గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి.

అర్హతలు: ఇంజినీరింగ్‌, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్‌, సైన్స్‌, హ్యూమానిటీస్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి లేదు.

అప్లికేషన్స్​: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్​ 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు www.gate2025.iitr.ac.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!