నిరుద్యోగులకు బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 4374 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. టెక్నికల్ ఆఫీసర్/సీ, సైంటిఫిక్ అసిస్టెంట్/బీ, టెక్నీషియన్/బీ, మరియు స్టైఫండరీ ట్రైనీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 24న ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 22ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. మొత్తం 4374 ఖాళీలకు గాను.. ఇందులో 212 ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. మరో 4162 ఖాళీలు ట్రైనింగ్ స్కీమ్ కింద భర్తీ చేస్తున్నారు.