బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు మే 3వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టు పేరు ఆఫీస్ అసిస్టెంట్(ప్యూన్): 500
అర్హత: పోస్టులను అనుసరించి పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు స్థానిక భాష చదవడం, రాయడం వచ్చి ఉండాలి.
వయోపరిమితి: 18 – 26 ఏళ్లు.
జీతం: నెలకు రూ.19,500.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు
ప్రారంభ తేదీ: 2025 మే 3.
దరఖాస్తు చివరి తేదీ: 2025 మే 23.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష ఆధారంగా.
అప్లికేషన్ విధానం: ఆసక్తి గల అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ www.bankofbaroda.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.