ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) పలు పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈసెట్ (ECET), ఐసెట్(ICET), ఎప్సెట్(EAPCET), లాసెట్(LAWCET), ఎడ్ సెట్(EDCET), పీజీ ఈసెట్(PGECET) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను https://apsche.ap.gov.in/circ.php వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మే 6న ఈసెట్, 7న ఐసెట్, మే 19 నుంచి 27 వరకు ఈఏపీసెట్, జూన్ 5 లాసెట్, ఎడ్‌సెట్, జూన్ 6న పీజీఈసెట్, జూన్ 9 నుంచి 13 వరకు పీజీసెట్ పరీక్షలను షిఫ్టుల వారిగా ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించనుంది.