న్యూ దిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ దిల్లీ 2025–-26 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ‘ఆల్-ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ 2025 (ఏఐఎల్‌ఈటీ)’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
యూజీ ప్రోగ్రామ్: ఐదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) ప్రోగ్రామ్‌లో 120 సీట్లు ఉన్నాయి. బీకాం ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్) నాన్-రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ లో 60 సీట్లు ఉన్నాయి. యూజీ కోర్సుకు సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
పీజీ ప్రోగ్రామ్: ఏడాది నాన్ రెసిడెన్షియల్ ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో 80 సీట్లు, ఎల్‌ఎల్‌ఎం(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా అండ్ మేనేజ్‌మెంట్) కోర్సులో 25 సీట్లు ఉన్నాయి. ఎల్‌ఎల్‌బీ లేదా తత్సమానమైన లా డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఎంఏ(ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ లా అండ్ మేనేజ్‌మెంట్) ప్రోగ్రామ్‌లో 25 సీట్లు ఉన్నాయి.
పీహెచ్‌డీ(లా, సోషల్ సైన్సెస్) కోర్సులో 31 సీట్లు ఉన్నాయి. ఇందుకోసం ఎల్‌ఎల్‌ఎం ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్: ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్-2025 తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. పూర్తి వివరాలకు www.nludelhi.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.