తెలంగాణలో గ్రూప్ 3, 4 పరీక్షలపై హైకోర్టులో దాదాపు 101 మంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 3, 4 ఉద్యోగాల్లో టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులు తొలగించారని వారు కోర్టుకు తెలిపారు. జీవో 55, 136 కొట్టివేయాలని కోరారు. గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్న టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ పోస్టులను ముందుగా ప్రకటించి, తరువాత తొలగించారన్నారు. పరీక్షలపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే.. ఈ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టు విచారణ నిర్వహించింది. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఉద్యోగ నియామక ప్రక్రియను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. ప్రభుత్వం, టీఎస్‌పీఎస్సీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జులై 13కి వాయిదా వేసింది.
గ్రూప్ 3, 4 అభ్యర్థులకు అలర్ట్.. పరీక్షల స్టే పై హైకోర్టు కీలక నిర్ణయం
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS
Current affairs test