తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ ఉద్యోగ నియామకాలకు (Notification No.&Date 20/2022, DT:07/12/2022) సంబంధించి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ ఇస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు దరఖాస్తు సమయంలో ఏమైనా మిస్టేక్స్ చేస్తే.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సరి చేసుకోవాలని సూచించింది.

ఈ ఎడిట్ ఆప్షన్ మే 1 నుంచి 4వ తేదీ వరకు అవకాశం ఉంటుందని తెలిపింది పబ్లిక్ సర్వీస్ కమిషన్. అభ్యర్థులు 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉండే ఎడిట్ ఆప్షన్ ను సద్వినియోగం చేసుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ సూచించింది.