తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. SCT పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్, తెలంగాణ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ & ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 17న నిర్వహించాల్సి ఉన్న డ్రైవింగ్ టెస్ట్ ను ఈ నెల 23కు, ఈ నెల 18న నిర్వహించాల్సి ఉన్న డ్రైవింగ్ టెస్ట్ ను ఈ నెల 24కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటనలో పేర్కొంది. వర్షం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీస్ రిక్రూట్మెంట్ వెల్లడించింది. మారిన తేదీలకు సంబంధించి అభ్యర్థులు కొత్త హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని బోర్డు వెల్లడించింది.