తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఎదురు చూస్తోన్న గురుకుల ఉద్యోగాలకు సంబంధించిన కీలక అప్టేట్ వచ్చేసింది. ఈ నెలలోనే మొత్తం 11,012 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని నియామక బోర్డు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వాస్తవానికి ఈ నెల మొదటి వారంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయాలని తొలుత భావించినప్పటికీ.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా ఆగిపోయింది. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో టీచింగ్ జాబ్స్ భర్తీకి ఈ నెల చివరిలోగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని గురుకుల నియామక బోర్డు భావిస్తోంది. ఇప్పటికే అనుమతులు లభించిన 11,012 పోస్టులకు ప్రస్తుతం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. తర్వాత అదనంగా మంజూరయ్యే పోస్టులకు రాత పరీక్ష నాటికి సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడుండడంతో దరఖాస్తుల సమయంలో టెక్నికల ఇబ్బందులు రాకుండా అధికారులు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. నోటిఫికేషన్ విడుదల తర్వాత నాలుగు నెలలకు రాత పరీక్ష ఉండాలని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు చేసుకోవడానికి నెల రోజుల గడువు ఇవ్వనున్నారు.
తెలంగాణ నిరుద్యోగులకు పండగ.. మరో 11 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నోటిఫికేషన్, రాత పరీక్ష ఎప్పుడంటే?
RELATED ARTICLES
PRACTICE TEST
LATEST
CURRENT AFFAIRS