టెట్​ స్కోర్​ ఎంత వస్తే.. డీఎస్సీలో వెయిటేజీ ఎంత కలుస్తుంది.. పూర్తి వివరాలు

టీచర్ల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వటంతో విధివిధానాల తయారీపై విద్యాశాఖ కసరత్తు మొదలు పెట్టింది. జిల్లా సెలెక్షన్​ కమిటీ (DSC) ద్వారా ఈ నియామకాల ప్రక్రియ చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం డీఎస్సీలో వచ్చే మెరిట్​, టెట్​లో వచ్చిన మార్కుల వెయిటేజీ, రిజర్వేషన్ల కోటా మేరకు సెలెక్షన్ జరుగుతుంది. ప్రతి జిల్లాల్లోనూ 95 శాతం మంది లోకల్. 5 శాతం మంది నాన్​ లోకల్ కోటా అమలవుతుంది. డీఎస్సీ రాత పరీక్షకు 80 శాతం మార్కులు, టెట్​ వెయిటేజీకి మిగతా 20 మార్కులను మెరిట్​ జాబితాకు పరిగణనలోకి తీసుకుంటారు. దీంతో టెట్​లో వచ్చే మార్కుల వెయిటేజీని ఎలా లెక్కిస్తారనేది అభ్యర్థులు తెలుసుకోవాల్సిన అవసరముంది. పూర్తి వివరాలను ఇక్కడ అందిస్తున్నాం.