గురుకులాల్లో 9231 ఉద్యోగాలు.. ఏమేం పోస్టులు.. ఎన్ని ఖాళీలు.. పూర్తి వివరాలివే

నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​. తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదల అయింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గురుకుల స్కూళ్లు, కాలేజీల్లో ఉద్యోగాల నియామకానికి సంబంధించిన కీలక ప్రకటన విడుదలైంది. రాష్ట్రంలోని గురుకుల విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న 9231 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్​ విడుదలైంది.