HomeLATESTవాట్ ఆఫ్టర్ ఇంటర్

వాట్ ఆఫ్టర్ ఇంటర్

ఇంటర్‍లేదా 10+2 పూర్తి చేసినవారికి సాధారణంగా డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ, సర్టిఫికెట్‍, కరెస్పాండెన్స్, ఇంటిగ్రేటెడ్ పీజీ వంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి. రక్షణ రంగం, బ్యాంకింగ్‍, ఎస్సెస్సీ, యూపీఎస్సీ, రైల్వే, పోస్టల్‍, పోలీస్‍, గ్రూప్స్, ఫారెస్ట్, ఎక్సైజ్‍, వీఆర్వో, వీఆర్‍ఏ, వంటి పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడొచ్చు. ఎంసెట్‍, నీట్‍, జేఈఈ, క్లాట్‍, జీప్యాట్‍, నాటా, ఎస్‍సీఆర్‍ఏ, నిఫ్ట్, ఎన్‍ఐడీ, ఎఫ్‍డీడీఐ, ఐఐఎస్‍ఈఆర్‍వంటి ఎంట్రన్స్ ‌లు రాసి ప్రొఫెషనల్ కోర్సుల్లో చేరొచ్చు. వీటితో పాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా అధికమే. డిస్టెన్స్ లో డిగ్రీ పీజీ ప్రోగ్రాములు ఆఫర్ చేస్తున్న సంస్థలకు కొదవే లేదు.

బ్యాచిలర్‍ డిగ్రీలో సైన్స్, మ్యాథ్స్, అగ్రికల్చర్& అల్లయిడ్‍, ఇంజినీరింగ్‍/టెక్నాలజీ, మెడికల్‍/పారా మెడికల్‍, ఫార్మసీ, ఆర్ట్స్& సోషల్‍సైన్సెస్‍, కామర్స్, మేనేజ్‍మెంట్‍, డిప్లొమా, ఓరియంటల్‍లాంగ్వేజస్‍, టీచర్ ఎడ్యుకేషన్, ఇంటిగ్రేటెడ్‍, లా, ఫ్యాషన్‍అండ్‍డిజైన్‍, ఏవియేషన్‍  వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని నేరుగా చేరే కోర్సులు కాగా మరికొన్ని ఎంట్రన్స్‌లు రాసేవి. ప్రస్తుతం సీయూసెట్‍, ఎంసెట్‍, ఈసెట్‍, జేఈఈ, బిట్‌శాట్, వీఐటీఈఈఈ, ఎస్‍ఆర్‍ఎంఈఈఈ, ఏఈఈఈ, నాటా, నీట్‍, ఎయిమ్స్, జిప్‍మర్‍, ఎయిమ్స్ నర్సింగ్ కేసెట్, ఐసర్‍ఏటీ, గీతం గ్యాట్‍, సీపెట్‍, ఏఐఈఈఏ, డీసెట్‍, ఎడ్‍సెట్‍, ఏఐఎంఏ యూగ్యాట్‍, టాన్‍సెట్‍, సింబయాసిస్, క్యాట్‍, మ్యాట్‍, గ్జాట్, లాసెట్‍, క్లాట్‍, ఏఐఎల్‌ఈటీ, ఎల్‌శాట్-ఇండియా, నిఫ్ట్, ఎన్‍ఐడీ డ్యాట్‍, ఏఐఈఈడీ, ఎఫ్‍డీడీఐ ఏఐఎటీ, యూసీడ్‍, ఎన్‍ప్యాట్‍, ఏఐఎంఏ యూగ్యాట్‍ వంటి యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి.

నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్

నేషనల్ అకాడమీ ఆప్ కన్‌స్ట్రక్షన్ లో ఐదోతరగతి మొదలుకొని పాలిటెక్నిక్, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల వరకు షార్ట్టెర్మ్, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కన్స్ర్టక్షన్ ట్రేడ్ ట్రైనింగ్ (సీటీటీ) కింద ఆఫర్ చేస్తున్న షార్ట్టెర్మ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల కాలవ్యవధి మూడు నెలలు. ఈ కోర్సులు చదవాలంటే 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. చదువు మధ్యలోనే ఆపేసిన వారు, డిగ్రీ చదివి జాబ్ లేని నిరుద్యోగుల్లో ఆసక్తి ఉండి అర్హులైన వారికి నేరుగా ప్రవేశం కల్పించి ఉచిత హాస్టల్వసతి, భోజన సదుపాయాలతో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తారు.

సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆప్ టూల్ డిజైన్

డిజైనింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో టూల్స్, డైస్, మౌల్డ్స్ అవసరాన్ని గుర్తించి షార్ట్‌టెర్మ్, లాంగ్‌టెర్మ్‌లో టెక్నికల్ ట్రైనింగ్ తో టూల్ డిజైనింగ్ కోర్సులు అందిస్తోంది సీఐటీడీ. ఆడియో-వీడియో (‌ఏవీ) అనే సర్టిఫికెట్ కోర్సులో  భాగంగా ఎల్ఈడీ, ఎల్‌సీడీ, ప్లాస్మా టీవీ, హోం థియేటర్, డీవీడీ బ్లూ రే ప్లేయర్స్ వంటి ఎలక్ర్టానిక్స్ పరికరాలను ఎలా రిపేర్ చేయాలో నేర్పిస్తారు. ఐటీఐ/ఇంటర్/డిప్లొమా/డిగ్రీ చదివిన వారు అర్హులు. హ్యాండ్ హెల్డ్ ఫోన్స్ గా పిలిచే ఈ కోర్సులో బేసిక్ ఫోన్స్ మొదలుకొని స్మార్ట్ ఫోన్స్, టాబ్లె్ట్స్ వరకు రిపేరింగ్ అండ్ సర్వీసింగ్‌లో 3 నెలలపాటు శిక్షణ ఇస్తారు. ఆర్ఏసీహెచ్‌ఏ కోర్సులు రిఫ్రిజరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్ ఓవెన్స్ వంటి వాటి సర్వీసింగ్‌తో పాటు రిపేరింగ్‌లో నాలుగు నెలల ట్రైనింగ్ ఇస్తారు. వీటిన్నింటికి ఐటీఐ ఆ పైన చదివిన వారంతా అర్హులే. అలాగే పదోతరగతి అర్హతతో సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ మిల్లింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ సీఎన్‌సీ టర్నింగ్ కోర్సులు కూడా చేయవచ్చు.

డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్

మన రాష్ర్టంలో ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీఈసెట్) ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (యూజీడీపీఈడీ), బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ) కోర్సులో ప్రవేశాలు కల్పిస్తారు. డీపీఈడీకి ఇంటర్/తత్సమాన ఉత్తీర్ణత కలిగి 16 ఏళ్లు నిండాలి. వీటికి రాత పరీక్ష ఉండదు. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్, మండల, జిల్లా, రాష్ర్టస్థాయి క్రీడాపోటీల్లో మెరిట్, సర్టిఫికెట్ల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. రన్నింగ్లో 100, 400, 800 మీటర్లు, లాంగ్ జంప్, హైజంప్ వంటి బేసిక్ ఈవెంట్స్‌లో అభ్యర్థి సామర్థ్యం, పరిజ్ఞానాన్ని టెస్ట్ చేస్తారు.

జువెల్లరీ డిజైన్

జువెల్లరీ రంగం విస్తరించి డిమాండ్ పెరగడంతో చాలా కాలేజీలు, సంస్థలు క్రాష్‌కోర్సులు, సర్టిఫికెట్‌, డిప్లొమా, డిగ్రీ, మాస్టర్స్‌, పీహెచ్‌డీ వంటి కోర్సులను రెగ్యులర్‌, డిస్టెన్స్‌లో కూడా అందిస్తున్నాయి. ఈ కోర్సులు సాధారణంగా రెండు/మూడు వారాల నుంచి రెండు లేదా మూడు సంవత్సరాల వరకు ఉంటాయి. డిప్లొమా ఇన్‌జువెల్లరీ డిజైన్‌, సర్టిఫికెట్‌ప్రోగ్రాం ఇన్‌జువెల్లరీ డిజైన్‌, నాన్‌స్టాండర్డ్‌ప్రోగ్రాం ఇన్‌జువెల్లరీ డిజైన్‌, కరస్పాండెన్స్‌ప్రోగ్రాం ఇన్‌జువెల్లరీ డిజైన్‌, కార్పోరేట్‌ప్రోగ్రాం ఇన్‌జువెల్లరీ డిజైన్‌, బ్యాచిలర్‌ఆఫ్‌డిజైన్‌అండ్‌టెక్నాలజీ, గ్రాడ్యుయేట్‌డిప్లొమా ప్రోగ్రామ్‌ వంటి జువెల్లరీ డిజైన్ కోర్సులు చదువుకొని స్థిరపడొచ్చు.

డీడీయూ–జీకేవై

ఈ పథకంలో భాగంగా అపోలో మెడ్స్కిల్ ద్వారా హెల్త్కేర్ సెక్టార్లో జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ప్లెబోటమి టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్, డయాబెటిస్ ఎడ్యుకేటర్, డెంటల్ అసిస్టెంట్ వంటి ప్రోగ్రాముల్లో 3 నుంచి 6 నెలల కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తూ ఇండస్ట్రీ అవసరాలు తీర్చడంతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోంది అపోలో మెడ్ స్కిల్స్ అనే సంస్థ. సంవత్సరం మొత్తం అడ్మిషన్లు జరుగుతాయి. సంబంధిత డొమైన్లో ఉచిత శిక్షణతో పాటు ఫ్రీ హాస్టల్, భోజన వసతి, యూనిఫాం, బుక్స్, స్టేషనరీ కూడా ఉచితంగా అందిస్తారు. ట్రైనింగ్లో  ఫార్మసీ అసిస్టెన్స్, ల్యాబ్ల్లో రక్త నమూనాలు సేకరించడం అంబులెన్స్లో డాక్టర్కు సహకరించడం, మానసిక/శారీరక వికలాంగులకు సహాయం చేయడం, క్లినిక్స్‌లో డెంటిస్ట్లకు అసిస్టెన్స్ ఇవ్వడం, డయాబెటిస్ రోగులకు సపోర్ట్ చేయడం వంటి వాటిలో శిక్షణ ఇస్తారు. ప్రాక్టికల్స్కు అధిక ప్రాధాన్యతనిస్తూ, విద్యార్థులు సందేహాలను నివృత్తి చేస్తూ సాగే ఈ శిక్షణ ద్వారా హెల్త్కేర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు.

ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్

హైదరాబాద్‌లో అసెంబ్లీకి ఎదురుగా ఉన్న ఐసీఐసీఐ అకాడమీ ఫర్ స్కిల్స్ ఆఫీస్ అడ్మినిస్ర్టేషన్, సెల్లింగ్ స్కిల్స్, రీటెయిల్ స్కిల్స్ వంటి మూడు కోర్సుల్లో ఫ్రీ ట్రైనింగ్ ఇస్తోంది. శిక్షణతో పాటు ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తారు. యూనిఫామ్స్, కోర్సు మెటీరియల్, స్టేషనరీ వంటివి అందిస్తారు. అధునాతన క్లాస్‌రూమ్స్, అడ్వాన్స్డ్ కంప్యూటర్ ల్యాబ్స్ లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. పదోతరగతి నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారెవరైనా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటే చాలు అకాడమీలో సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చు.కోర్సు ట్రైనింగ్‌కు అదనంగా కమ్యూనికేషన్ అండ్ ఫైనాన్స్ స్కిల్స్, ఎటిక్వెట్ అండ్ గ్రూమింగ్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. కోర్సుకు సంబంధించిన సందేహాలతో పాటు కెరీర్స్, ఉద్యోగావకాశాలు వంటి వాటిపై ఫ్యాకల్టీ అవగాహన కల్పిస్తారు.

ఆడోబ్ ప్యాకేజస్

గ్రాఫిక్‍డిజైన్‍, యానిమేషన్‍, ఎడిటింగ్‍, మిక్సింగ్‍, డెస్క్ టాప్‍పబ్లిషింగ్‍కు అత్యధికులు వినియోగిస్తున్నది అడోబ్‍సాఫ్ట్‌వేర్లనే. ఫలితంగా అడోబ్‍క్రియేటివ్‍అండ్‍డిజైన్‍అప్లికేషన్లలో ఎక్స్‌పర్టైజ్‍సాధించిన వారికి డిమాండ్‍గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అడోబ్‍ఫోటోషాప్‍, పేజ్‍మేకర్‍, ఇన్‍డిజైన్‍, ఇన్‍కాపీ, ఇమేజ్‍రెడీ ఇల్యూస్ర్టేటర్‍, ఫ్రేమ్‍మేకర్‍, ఆక్రోబాట్‍, అడోబ్‍అల్ర్టా, స్పార్క్ వీడియో, ప్రీమియర్‍ప్రో, ప్రీమియర్‍ఎలిమెంట్స్, డైరెక్టర్, యానిమేట్‍, ఆఫ్టర్‍ఎఫెక్ట్స్, క్యారెక్టర్‍యానిమేట్‍, అడోబ్‍మ్యూస్, గో లైవ్‍, ఫ్లాష్‍బిల్డర్‍, ఫ్లాష్‍ఎడ్జ్, డ్రీమ్‍వీవర్‍, యానిమేట్‍ వంటి సాఫ్ట్‌వేర్లు నేర్చుకున్నవారికి      ఫిల్మ్ అండ్‍మోడలింగ్‍ఇండస్ర్టీ, ప్రింట్‍మీడియా, ఎలక్ర్టానిక్‍మీడియా, వెబ్‍మీడియా, యానిమేషన్‍కంపెనీలు, డిజైన్‍అండ్‍పబ్లికేషన్ సంస్థలు, యాడ్‍ఏజెన్సీలు, వీడియో క్రియేషన్స్, రేడియో అండ్‍ఎఫ్‍ఎం, మార్కెటింగ్‍కన్సల్టెంట్‍సంస్థల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

కంప్యూటర్ కోర్సులు

ఇంటర్ చదివిన వారు ప్రొఫెషనల్ గా కంప్యూటర్ అప్లికేషన్స్, డిజైన్ అండ్ గ్రాఫిక్స్ కోర్సులు చేరుతుండగా పై చదువులు చదవలేనివారు ఎంఎస్ ఆఫీస్, డెస్క్‌టాప్ పబ్లిషింగ్, మల్టీమీడియా, వెబ్ డిజైనింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ హార్డ్‌వేర్, కంప్యూటర్ ఎయిర్‌లైన్ టికెటింగ్, సర్టిఫికెట్ కోర్స్ ఇన్ కంప్యూటర్ అకౌంటెన్సీ(అడ్వాన్స్‌డ్), యూనిక్స్, సీ, సీ++, కాల్‌సెంటర్ ట్రైనింగ్, కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, ఆఫీస్ ఆటోమేషన్ ప్రోగ్రాం, కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్, టూరిజం ట్రావెల్ టెక్నిక్స్ వంటి సాఫ్ట్‌వేర్, కంప్యూటర్ ప్రోగ్రామ్స్ షార్ట్‌టెర్మ్, లాంగ్ టెర్మ్ లో చదివిన వారు మీడియా సంస్థలు, కంప్యూటర్ ఇన్‌స్టిట్యూట్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీలతో పాటు కంప్యూటర్ నెట్ వర్క్ తో నడిచే అన్ని రకాల కార్యాలయాల్లో కెరీర్ ప్రారంభించవచ్చు.

ఎపీ కల్చర్‍

కృత్రిమ పద్ధతిలో తేనెటీగలను పెంచి తేనె ఉత్పత్తి చేయడాన్ని ఎపీ కల్చర్‍లేదా బీకీపింగ్ అంటారు. దీనిలో తేనెటీగల జాతులు, బీ కీపింగ్‍ఎక్విప్‍మెంట్‍, బీ కాలనీల ఏర్పాటు, వాటి నిర్వహణ, పాలినేషన్‍, హనీ ఎక్స్‌ట్రాక్షన్‍, వ్యాక్స్ కలెక్షన్‍,  తేనెటీగల వ్యాధులు, మార్కెటింగ్‍వంటి అంశాలను అధ్యయనం చేస్తారు. దీనికి సర్టిఫికెట్‍కోర్సు ఇన్‍బీకీపింగ్‍, ఎంఎస్సీ ఎంటమాలజీ అండ్‍ఎపికల్చర్‍వంటి ఫార్మల్‍ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటితో పాటు కొన్ని అగ్రికల్చర్‍కోఆపరేటివ్‍సొసైటీలు, సంస్థలు చదువురాని వారు, రైతులకు కూడా బీ కీపింగ్‍లో శిక్షణ ఇస్తున్నాయి. ఈ శిక్షణ సాధారణంగా 7 రోజుల నుంచి 6 నెలల వరకు ఉంటుంది. తమిళనాడు అగ్రికల్చర్‍యూనివర్శిటీ బీ కీపింగ్ లో ట్రైనింగ్‍కోర్సులు ఆఫర్‍చేస్తుంది.

సెరీ కల్చర్‍

పట్టు పురుగుల పెంపకం, హార్వెస్టింగ్‍, రీలింగ్‍అండ్‍స్పిన్నింగ్‍, వేవింగ్‍, సిల్క్ వార్మ్ వ్యాధులు, మార్కెటింగ్‍వంటి అంశాలను అధ్యయనం చేసేది సెరీకల్చర్‍. డిప్లొమా ఇన్‍సెరీకల్చర్‍టెక్నాలజీ అండ్‍మేనేజ్‍మెంట్‍, బీఎస్సీ సెరీకల్చర్‍, బీఎస్సీ సిల్క్ టెక్నాలజీ, ఎంఎస్సీ, పీహెచ్‍డీ ఇన్‍సెరీకల్చర్‍, వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో డిగ్రీ కోర్సులకు ఇంటర్‍బైపీసీ ఉత్తీర్ణత ఉండాలి. ఎంఎస్సీ కోర్సులకు బీఎస్సీ సెరీకల్చర్‍లేదా సిల్క్ టెక్నాలజీ పాసవ్వాలి. శ్రీకృష్ణ దేవరాయ యూనివర్శిటీ, కాకతీయ యూనివర్శిటీ, కాలేజ్‍ఆఫ్‍సెరీకల్చర్‍(కర్ణాటక), యూనివర్శిటీ కాలేజ్‍ఆఫ్‍అగ్రికల్చర్‍( బెంగళూరు) ఫారెస్ట్ కాలేజ్‍అండ్‍రీసెర్చ్ (కోయంబత్తూర్‍), తమిళనాడు అగ్రికల్చర్‍యూనివర్శిటీ, సెంట్రల్‍అగ్రికల్చర్‍రీసెర్చ్ ఇన్‍స్టిట్యూట్‍వంటివి  ఈ కోర్సులు అందిస్తున్నాయి.

స్వయం ఉపాధి కోర్సులు

జ్యుయలరీ డిజైన్
యానిమేషన్‍& మల్టీ మీడియా, గేమింగ్‍
వెబ్‍డిజైనింగ్
యాప్ డెవలపింగ్
కంప్యూటర్ అప్లికేషన్స్
ఫ్యాషన్ డిజైనింగ్
బ్యూటీ అండ్ హెల్త్‌కేర్

ఇన్‌స్టిట్యూట్‍లు
ఐఐటీలు
ఐఐఎస్‌ఈఆర్
ఎన్‌ఐటీలు
ట్రిపుల్ ‌ఐటీలు
బిట్స్
వీఐటీ
ఎస్‌ఆర్‌ఎం
గీతం

యూనివర్శిటీలు
సెంట్రల్‍యూనివర్శిటీలు
స్టేట్‍యూనివర్శిటీలు
డీమ్డ్ యూనివర్శిటీలు
డిస్టెన్స్ ఎడ్యుకేషన్
బీఆర్‍ఏఓయూ
ఇగ్నో
మణిపాల్‍ యూనివర్శిటీ
ఎంఎన్‍యూయూ
కురుక్షేత్ర యూనివర్శిటీ
యూనివర్శిటీ ఆఫ్‍మద్రాస్‍
పీజీఆర్‍ఆర్‍సీడీఈ, ఉస్మానియా
హెచ్‌సీయూ
కాకతీయ
నాగార్జున
ఆంధ్రా యూనివర్శిటీ
శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ

ఉద్యోగాలు

స్టేట్‍: గ్రూప్స్, ఏఈఈ, ఏఈ, ఆర్డీవో, డీఎస్‌పీ, సీటీవో, ఆర్‌టీవో, డీటీ, సబ్‍రిజిస్ర్టార్‍, మున్సిపల్‍కమీషనర్‍, ఎక్సైజ్‍ఎస్‍ఐ, కానిస్టేబుల్‍, ఎక్సైజ్‍కానిస్టేబుల్‍, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్‍, ఫారెస్ట్ బీట్‍ఆఫీసర్‍, అసిస్టెంట్‍బీట్‍ఆఫీసర్‍
డిఫెన్స్: ఎన్‍డీఏ&ఎన్‍ఏ, సీడీఎస్‍, టెక్నికల్‍ఎంట్రీ, పైలట్‍(ఎన్‌డీఏ సీడీఎస్‌ఈ, ఎన్‌డీఏ, సీడీఎస్‌ఈ, నేషనల్ క్యాడెట్ కార్ప్స్ స్పెషల్ ఎంట్రీ, సీఏపీఎఫ్‍
మెడికల్‍: డాక్టర్‍, సీఎంఎస్‍,
ఇంజినీరింగ్‍: లెక్చరర్స్, ప్రొఫెసర్స్, సైంటిస్టులు, గ్రూప్స్, సివిల్స్, బ్యాంక్స్, ఎస్సెస్సీ
యూపీఎస్సీ: ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, ఐఆర్‍ఎస్‍, ఐఈఎస్‍, ఐఈఎస్‍, ఐఎస్‍ఎస్‍, జియోలజిస్ట్,
బ్యాంక్స్: క్లర్కులు, పీవో, స్పెషలిస్ట్ ఆఫీసర్లు, ఐటీ, కంప్యూటర్స్, అగ్రికల్చరల్, సివిల్‍, లా
ఎస్సెస్సీ: సీహెచ్ఎస్‍ఎల్‍, స్టెనోగ్రాఫర్‍, ఎంటీఎస్‍
టీచర్‍: డీఎస్సీ, టీఆర్టీ, టెట్‍, సీటెట్‍, గురుకుల, మోడల్‍స్కూల్స్, ఆర్మీ స్కూల్స్, కేవీఎస్‍, ఎన్‍వీఎస్‍
లెక్చరర్స్: జూనియర్‍లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, అసిస్టెంట్‍ప్రొఫెసర్స్,
జాబ్స్ ఇన్ పీఎస్‌యూ: ఇస్రో, బీఎస్‍ఎన్‍ఎల్‍, గెయిల్‍, సెయిల్‍, ఎన్‍ఎండీసీ, బీహెచ్‍ఈఎల్‍, ఓఎన్‍జీసీ, సీఐఎల్‍, ఐవోసీఎల్‍, బీఈఎల్‍, హాల్‍, నాల్కో, ఎంటీఎన్‍ఎల్‍, ఏఏఐ, బీడీఎల్‍, బీఈఎంఎల్‍, ఈసీఐఎల్‍, డీసీఐ, హెచ్‍ఎంటీ
రైల్వే: ఏఎల్‍పీ, ఆర్‍పీఎఫ్‍, ఎస్‍సీఆర్ఏ
ఏవియేషన్‍: పైలట్‍, ఎయిర్‍హోస్టెస్‍
ఫిల్మ్ అండ్ టెలివిజన్: రేడియో జాకీ, వీడియో జాకీ , యాంకరింగ్‍, వీడియో ఎడిటింగ్‍, ఫోటోగ్రాఫర్‍, వీడియోగ్రాఫర్, డైరెక్టర్‍, ఎడిటర్‍, టెక్నీషియన్‍,

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!