HomeJOBSమహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీ మహిళా అభివృద్ధి & శిశు సంక్షేమ శాఖ (WCD AP) శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్స్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 69 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని చిన్నారులు, గర్భిణీ స్త్రీలకు సేవలందించేందుకు ఆసక్తి ఉన్న స్థానిక మహిళలకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. డిసెంబర్ 22 నుంచి అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్ అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు- 69

  1. అంగన్‌వాడీ కార్యకర్తలు- 11
  2. అంగన్‌వాడీ సహాయకులు- 58

అర్హతలు:
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి టెన్త్ లేదా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు అప్లై చేసుకోవడానికి అర్హులు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ,ఎస్టీ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

స్థానికత: ఇది అత్యవసరం. అప్లై చేసుకునే అభ్యర్థులు ఏ గ్రామం లేదా వార్డులో ఖాళీ ఉందో ఖచ్చితంగా అదే ప్రాంతంలో నివాసం ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

అప్లికేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 22 వ తేదీ నుంచి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

చివరి తేదీ: డిసెంబర్ 30 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

జీతం:
అంగన్‌వాడీ కార్యకర్తలకు నెలకు రూ. 11,500 జీతం లభిస్తుంది.
అంగన్‌వాడీ సహాయకులకు నెలకు రూ. 7,000 జీతం ఉంటుంది.

అప్లై చేసుకునే విధానం:
ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఆఫ్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది.

అభ్యర్థులు జిల్లా అధికారిక వెబ్‌సైట్ srisathyasai.ap.gov.in నుంచి ముందుగా అప్లికేషన్ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

ఫారమ్‌లో అడిగిన వివరాలను తప్పులు లేకుండా పూర్తి చేయాలి.

అప్లికేషన్‌తో పాటు టెన్త్ మెమో, రెసిడెన్స్ సర్టిఫికెట్,క్యాస్ట్ సర్టిఫికెట్ లను కలపాలి.

పూర్తి చేసిన అప్లికేషన్‌లను సంబంధిత ICDS (Integrated Child Development Services) ప్రాజెక్ట్ ఆఫీసులో గడువు లోపు స్వయంగా అందజేయాలి.

ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేకుండా జరుగుతున్న ఈ రిక్రూట్‌మెంట్, స్థానిక మహిళలకు ఉపాధిని కల్పించడమే కాకుండా సామాజిక సేవలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. అర్హత ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీలోపు అప్లై చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here