HomeJOBSఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..

ఏపీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు..

ఏపీ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ.. చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు (CWC),జువెనైల్ జస్టిస్ బోర్డులలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 182 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులను భట్టి విద్యార్హత నిర్ణయించారు. అభ్యర్థులు డిసెంబర్ 22 వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. 35 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
ఈ నియామక ప్రక్రియను ఏపీ జువెనైల్ వెల్ఫేర్, కరెక్షనల్ సర్వీసెస్ & వెల్ఫేర్ ఆఫ్ స్ట్రీట్ చిల్డ్రన్ శాఖ (JWCS&WSC AP) నిర్వహిస్తోంది. జిల్లాకు 7 పోస్టుల చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 182 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

మొత్తం పోస్టులు- 182 పోస్టులు
పోస్టులు- CWC ఛైర్‌పర్సన్ , JJB సోషల్ వర్కర్
1.CWC ఛైర్‌పర్సన్ పోస్టులు :130 పోస్టులు
2. JJB సోషల్ వర్కర్ : 52 పోస్టులు
అప్లికేషన్ విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ: డిసెంబర్ 22 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వెబ్‌సైట్: https://wdcw.ap.gov.in/

విద్యార్హత:

  1. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (CWC) ఛైర్‌పర్సన్ & సభ్యులు :
    విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్సెస్, విద్యా, న్యాయ రంగాలలో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు. తప్పనిసరిగా.. ఏపీ నివాసి అయి ఉండాలి.

అనుభవం: పిల్లల సంక్షేమం, ఆరోగ్యం లేదా విద్యా రంగంలో కనీసం ఏడు సంవత్సరాల అనుభవం ఉండాలి. లేదా సంబంధిత డిగ్రీతో ప్రాక్టీస్ చేస్తున్న వృత్తి నిపుణులై ఉండాలి.

  1. జువెనైల్ జస్టిస్ బోర్డు (JJB) సామాజిక కార్యకర్త సభ్యులు:
    విద్యార్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైకియాట్రీ, సోషియాలజీ, హెల్త్ సైన్సెస్, విద్యా, న్యాయ రంగాలలో డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తారు.

అనుభవం: పిల్లల సంక్షేమం, ఆరోగ్యం లేదా విద్యా రంగంలో కనీసం ఏడు సంవత్సరాల అనుభవం ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించిన బాలల కార్యక్రమాలలో కనీసం 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయస్సు:
ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు 35 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

జీతం:
ఈ పోస్టులు సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలు కావు. ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మేరకు గౌరవ వేతనం / సిట్టింగ్ అలవెన్స్ చెల్లిస్తారు.

అప్లికేషన్ విధానం :
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు WCD AP అధికారిక వెబ్‌సైట్ https://wdcw.ap.gov.in/ ద్వారా డిసెంబర్ 22 వరకు ఆన్‌లైన్‌‌‌లో అప్లై చేసుకోవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here