HomeLATESTమున్సిపాలిటీల్లో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్​ పోస్టులు: నిరుద్యోగులకు శుభవార్త

మున్సిపాలిటీల్లో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్​ పోస్టులు: నిరుద్యోగులకు శుభవార్త

రాష్ట్రంలో కొత్తగా 2298 వార్డు ఆఫీసర్లను నియమించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మున్సిపాలిటీలు.. కార్పొరేషన్‌లలోని వార్డులు, డివిజన్లలో పని చేసేందుకు కొత్తగా వార్డు ఆఫీసర్లను నియమిస్తున్నట్లు మున్సిపల్​ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. త్వరలోనే ఈ కొత్త పోస్టులకు నోటిఫికేషన్​ జారీ చేయనున్నారు.

Advertisement

ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండేందుకే వార్డు ఆఫీసర్ల నియామకాలు చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామాల్లో జూనియర్​ పంచాయతీ కార్యదర్శుల తరహాలో పట్టణాల్లో ప్రతి వార్డుకు ఈ వార్డు ఆఫీసర్ల సేవలను వినియోగించుకోనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఉన్న ఉద్యోగులను రేషనలైజేషన్​ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,298 పోస్టులను భర్తీ చేయాల్సి ఉంటుందని మున్సిపల్​ డిపార్టుమెంట్​ లెక్కలేసింది. త్వరలోనే ఈ రిక్రూట్​మెంట్​ చేపట్టే బాధ్యతలను టీఎస్​పీఎస్​సీకి అప్పగించనుంది. వార్డు ఆఫీసర్​ పోస్టులకు కనీసం డిగ్రీ ఉత్తీర్ణతను అర్హతగా పరిగణించనున్నారు.

సెప్టెంబర్​ చివరి వారం లేదా.. అక్టోబర్​ మొదటి వారంలో ఈ నోటిఫికేషన్​ వెలువడే అవకాశాలున్నాయి. త్వరలోనే గ్రేటర్​ హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరుగనున్నాయి. ఈలోగా రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ జారీ చేసి పోస్టుల భర్తీ కసరత్తు మొదలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగంలో పనులు అడ్మినిస్ట్రేషన్‌ పనులు ఆలస్యమవుతున్నాయని, దీనిని నివారించేందుకు ఇద్దరు సీఈలను , వారికి సహాయంగా ఇద్దరు నుంచి ముగ్గురు ఎస్‌ఈలను నియమించాలని ఇటీవల రాష్ట్ర కేబినేట్​ నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ ఖాళీలను గుర్తించే ప్రక్రియ మొదలైంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు రిక్రూట్​మెంట్​ నోటిఫికేషన్​ కూడా వచ్చే నెలలోనే వెలువడనుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!