HomeLATESTవరంగల్​ సైనిక్​ స్కూల్​ లో 6వ తరగతి, ఇంటర్​ అడ్మిషన్లు.. అప్లై చేయడమెలా

వరంగల్​ సైనిక్​ స్కూల్​ లో 6వ తరగతి, ఇంటర్​ అడ్మిషన్లు.. అప్లై చేయడమెలా

వరంగల్‌ లోని సైనిక్​ స్కూల్ (WARANGAL SAINIK SCHOOL) అడ్మిషన్ల నోటిఫికేషన్​ వెలువడింది.సైనిక ఉద్యోగాల (INDIAN ARMY JOBS) కల్పనే లక్ష్యంగా వరంగల్ లోని అశోక్‌నగర్‌లో తెలంగాణ ట్రైబల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ సొసైటీ బాలుర కోసం ప్రత్యేకంగా ఈ పాఠశాలను ప్రారంభించింది. ఎన్​డీఏ (NDA), ఎస్‌ఎస్‌బీ (NSB) తదితర సైనిక దళాల్లో చేరేందుకు వీలుగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించటం, ప్రత్యేక శిక్షణను అందించేందుకు ఈ స్కూల్​ను నెలకొల్పారు. సైనిక శిక్షణే ప్రధానాంశంగా స్కూల్​ యాక్టివిటీస్ ఉంటాయి. ఆరో తరగతి లేదా ఇంటర్​ చేరాలనుకునే విద్యార్థులకు ఎంట్రన్స్​ టెస్ట్ నిర్వహించి మెరిట్​, ఫిజికల్​ ఫిట్​నెస్​ అధారంగా సీట్లు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత వసతి, భోజనంతో పాటు దుస్తులు, పుస్తకాలన్నీ ప్రభుత్వమే అందిస్తుంది.

Advertisement

2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన అడ్మిషన్లకు తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TTWREIS) నోటిఫికేషన్​ జారీ చేసింది. ఆరో తరగతి (CBSE Syllabus), ఇంటర్మీడియట్‌ (MPC-CBSE Syllabus)లో అడ్మిషన్లకు విద్యార్థుల నుంచి అప్లికేషన్లను ఆహ్వానిస్తోంది. రాత పరీక్షతో పాటు ఫిజికల్​ ఎఫిషియెన్సీ, మెడికల్​ టెస్ట్ ల ఆధారంగా (శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు) విద్యార్థులను ఎంపిక చేస్తారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్‌ 8వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్‌ 30న రాత పరీక్ష నిర్వహిస్తారు.

అర్హతలు: ఆరో తరగతి లో చేరాలనుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి అయిదో తరగతి పరీక్షకు హాజరై ఉండాలి. బాలురు మాత్రమే అర్హులు. ఇంటర్‌ లో చేరాలనుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన పాఠశాల నుంచి పదో తరగతి పరీక్షకు హాజరై ఉండాలి. ఉత్తీర్ణులైన బాలురు మాత్రమే అడ్మిషన్లకు అర్హులవుతారు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2 లక్షలు (పట్టణ ప్రాంతం), రూ.1.50 లక్షలు (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. తెలుగు/ ఇంగ్లిష్‌ మీడియం విద్యార్థులు అర్హులు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

సీట్ల సంఖ్య: ఆరో తరగతి- 80 సీట్లు, ఇంటర్- 80 సీట్లు.

Advertisement

ఎంపిక ప్రక్రియ: రాత, శారీరక సామర్థ్య, వైద్య పరీక్షల ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది.

రాత పరీక్ష : ఆరో తరగతి రాత పరీక్ష అయిదో తరగతి వరకు చదువుకున్న పుస్తకాల నుంచి ఉంటుంది. మొత్తం 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలుంటాయి. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలు అడుగుతారు. తెలుగు 20 మార్కులు, ఇంగ్లిష్‌ 30 మార్కులు, మ్యాథ్స్‌ 30 మార్కులు, సైన్స్‌ 10 మార్కులు, సోషల్‌ స్టడీస్‌ నుంచి 10 మార్కుల ప్రశ్నలు ఉంటాయి.  

ఇంటర్‌ రాత పరీక్ష 8-10వ తరగతి స్థాయిలో ప్రశ్నలుంటాయి. 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. సబ్జెక్టుల వారీగా ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌ 20 మార్కులు, మ్యాథ్స్‌ 40 మార్కులు, ఫిజిక్స్‌ 20 మార్కులు, కెమిస్ట్రీ 15 మార్కులు, బయాలజీ నుంచి 5 మార్కుల ప్రశ్నలుంటాయి.

Advertisement

(అడ్మిషన్ల నోటిఫికేషన్​ సంబంధించిన పూర్తి వివరాల పీడీఎఫ్​ పోస్టు చివరలో ఉంది) 

రిజిస్ట్రేషన్ ఫీజు: రూ.200.
అప్లికేషన్లు: విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేయాలి.
అప్లికేషన్లకు చివరి తేదీ: 08.04.2023.
హాల్ టిక్కెట్‌ డౌన్‌లోడ్ తేదీ: 23.04.2023
ఎంట్రన్స్​ ఎగ్జామ్​ తేదీ: 30.04.2023.
1:3 నిష్పత్తిలో మెరిట్​ లిస్ట్ విడుదల: 05.05.2023.
ఫిజికల్ ఫిట్‌నెస్ ఎగ్జామ్​ : 08.05.2023 నుంచి 13.05.2023 వరకు.
సైనిక పాఠశాలలో అడ్మిషన్ల తేదీ: 12.06.2023.

WARANGAL SAINIK SCHOOL (TTWREIS) ADMISSION NOTIFICATION 2023-24

ADMISSIONS IN TO 6th CLASS (CBSE SYLLABUS) and INTERMEDIATE(MPC-CBES SYLLABUS)

TOTAL SEATS6th Class 80 Seats,
Inter MPC 80 Seats
Registration Fee: Rs.200
Applications: Students should apply online
Last date for applications:08.04.2023
Hall Ticket Download Date: 23.04.2023
Date of Entrance Exam: 30.04.2023
Release of Merit List in 1:3 ratio: 05.05.2023
Physical Fitness Exam : From 08.05.2023 to 13.05.2023
Date of Admissions in Military School: 12.06.2023

Advertisement

Advertisement

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!