విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA).. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 58 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. బీటెక్, బీఈ, డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. నవంబర్ 30 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫకేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి వివరాలు:
మొత్తం పోస్టులు- 58
సంస్థ పేరు- విశాఖపట్నం పోర్ట్ అథారిటీ (VPA)
పోస్ట్ పేరు – అప్రెంటిస్‌లు
అధికారిక వెబ్‌సైట్ : vizagport.com
పోస్టుల వారిగా ఖాళీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లు : 27 పోస్టులు
టెక్నీషియన్ అప్రెంటిస్‌లు: 31 పోస్టులు
అర్హతలు:
విద్యార్హత: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి బీటెక్/బీఈ పూర్తి చేసి ఉండాలి.
టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్‌కు అప్లై చేసే అభ్యర్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయస్సు:
అభ్యర్థుల వయస్సు అప్రెంటిస్‌షిప్ నియమాల ప్రకారం పరిగణలోకి తీసుకుంటారు.
ఎంపిక విధానం:
అప్రెంటిస్‌ల నియామకం పూర్తిగా మెరిట్ ఆధారంగా జరుగుతుంది.
మెరిట్ ఆధారంగా ఎంపిక: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్‌కు బీటెక్/ బీఈలో టెక్నీషియన్ అప్రెంటిస్‌షిప్‌కు డిప్లొమాలో అభ్యర్థులు సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు.
ఫైనల్ లిస్ట్ : ADT BOAT,VPA అధికారుల ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత కేటగిరీల వారీగా ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అధికారిక వెబ్ సైట్ https://vizagport.com/ ద్వారా అప్లై చేసుకోవచ్చు.





