HomeJOBSవిశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో.. క్లర్క్ ఉద్యోగాలు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో.. క్లర్క్ ఉద్యోగాలు

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (VCBL) ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని తమ శాఖల్లో క్లరికల్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 45 క్లర్క్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకునే అభ్యర్థులు ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు.

ఉద్యోగ వివరాలు:
పోస్టు పేరు: క్లరికల్ ట్రైనీ
ఖాళీల సంఖ్య: 45
జాబ్ లొకేషన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖలు

అర్హతలు:
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా రెగ్యులర్ స్ట్రీమ్‌లో ఫస్ట్ క్లాస్‌తో గ్రాడ్యుయేషన్ (60% మార్కులు ఉండాలి).
భాషా నైపుణ్యం: ఇంగ్లీష్, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవడంలో నైపుణ్యం ఉండాలి.
కంప్యూటర్ నాలెడ్జ్: కంప్యూటర్ ఆపరేషన్‌లో ప్రాథమిక జ్ఞానం అవసరం.
వయస్సు : అభ్యర్థుల వయస్సు 31 డిసెంబర్ 2023 నాటికి 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ( 01-01-1994 నుంచి 31-12-2003 మధ్య ఉండాలి).

జీతం:
ట్రైనింగ్ పీరియడ్: ఆరు రెగ్యులర్ శాఖలు, రెండు ఆన్‌లైన్ శాఖల్లో శిక్షణ కాలంలో నెలకు రూ. 10,000/-.

ఆన్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 10.07.2025.
ఆప్ లైన్ అప్లికేషన్ చివరి తేదీ: 16.07.2025.

శాశ్వత ఉద్యోగం తర్వాత: శిక్షణ పూర్తయిన తర్వాత జీతం నెలకు రూ. 20,000 వరకు ఉంటుంది. డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఇతర ప్రయోజనాలు ఉంటాయి.

ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష: అభ్యర్థులు ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలతో కూడిన ఆన్‌లైన్/కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT)లో పాల్గొనాలి. పరీక్షలో ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ సెక్షన్లు ఉంటాయి.

ఇంటర్వ్యూ: రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఇంటర్వ్యూకి హాజరు కావాలి.

డాక్యుమెంట్ వెరిఫికేషన్: చివరి దశగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.

అప్లికేషన్ ప్రక్రియ:

అప్లికేషన్ పంపాల్సిన చిరునామా:

డిప్యూటీ మేనేజర్ (HR),
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్,
డి.నెం. 47-3-27/3, 5వ లేన్, ద్వారకానగర్, విశాఖపట్నం – 530016, ఏపీ.
ఇమెయిల్ ద్వారా అప్లికేషన్: అభ్యర్థులు తమ అప్లికేషన్ ఫారమ్‌ను సంబంధిత డాక్యుమెంట్లతో కలిపి hr@vcbl.in కి కూడా ఇమెయిల్ చేయవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here