Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSపోలీస్​ శాఖలో 17 వేల ఖాళీలు.. వెయ్యికి పైగా ఎస్​ఐ పోస్టులు

పోలీస్​ శాఖలో 17 వేల ఖాళీలు.. వెయ్యికి పైగా ఎస్​ఐ పోస్టులు

తెలంగాణలో ఉద్యోగ ఖాళీల గుర్తింపు ప్రక్రియ స్పీడ్​ అందుకుంది. ఇప్పటికే కొన్ని శాఖలు తమ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను ప్రభుత్వానికి సమర్పించాయి. ఇందులో భాగంగా తెలంగాణ పోలీస్​ శాఖ మొత్తం 17 వేల ఖాళీలున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. ఇందులో దాదాపు 16 వేల కానిస్టేబుల్​ పోస్టులతో పాటు 1000 ఎస్​ఐ పోస్టులున్నాయి.

Advertisement

రాష్ట్రంలో కొత్త జోన్లు.. జిల్లాల వారీగా ఉద్యోగుల విభజన ఇటీవలే ముగిసింది. దీంతో శాఖల వారీగా ఖాళీల సమాచారాన్ని వెంటనే అందించాలని వారం రోజుల కిందటే సీఎస్​ సోమేష్​కుమార్​ ఆదేశాలు జారీ చేశారు. అన్ని శాఖల్లో దాదాపు 76 వేల ఖాళీలున్నట్లు ప్రభుత్వం నియమించిన ఐఏఎస్​ల కమిటీ ఇప్పటికే ప్రాధమికంగా గుర్తించింది. ఇప్పుడు చేస్తున్న కసరత్తుతో ఖాళీల సంఖ్య పక్కాగా తేలుతుందని ప్రభుత్వానికి నివేదించింది.

ప్రభుత్వం ఏ క్షణం నోటిఫికేషన్​ జారీ చేసినా.. పోలీసు శాఖకు చెందిన నోటిఫికేషన్లే ముందుగా వెలువడుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పోలీసు శాఖలో ఖాళీల వివరాలపై నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. కొత్త జిల్లాల వారీగా ఖాళీల జాబితాను రెడీ చేసిన పోలీస్​ శాఖ రెండు రోజుల కిందటే ఈ వివరాలను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం. మొత్తం 17 వేల ఖాళీలు ఈ జాబితాలో ఉన్నట్లు లెక్కతేలింది.

తెలంగాణ స్టేట్​ లెవల్​ పోలీస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు (TSLPRB) ద్వారా వీటిని భర్తీ చేస్తారు. గత ఏడాది కూడా TSLPRB ద్వారా నోటిఫికేషన్లు వేయాలని ప్రభుత్వం భావించింది. కానీ జోన్లు, కొత్త జిల్లాల ఏర్పాటు కారణంగా సాంకేతిక అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో చివరి నిమిషంలో ప్రభుత్వం ఈ ఫైలును పక్కకు పెట్టింది. ఇటీవలే జోన్లు, జిల్లాల సమస్య కొలిక్కి రావటం తో ప్రధాన అడ్డంకి తొలిగిపోయింది. వీటికి అనుగుణంగా ఉద్యోగుల విభజన, ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కూడా పూర్తి కావటంతో రిక్రూట్​ఎంట్​కు లైన్​ క్లియర్​ అయింది. ఇప్పుడు కొత్త జోన్లు, కొత్త జిల్లాల వారీగా ఖాళీల జాబితా కూడా రెడీ కావటంతో ప్రభుత్వం ఆమోదించటంతో పాటు.. రిక్రూట్​మెంట్​కు అనుమతించటమే మిగిలింది. దీంతో రాష్ట్రంలో ఏళ్లకేళ్లుగా ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఆశలు చిగురించినట్లయింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!