యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవల పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2026 ద్వారా ఏకంగా 450 కి పైగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ ఇంజనీర్, లీగల్ ఆఫీసర్, వంటి వివిధ మెడికల్ స్పెషలిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.. బీఫార్మసీ, బీటెక్, ఎల్‌ఎల్‌బీ, ఎమ్మెస్సీ అర్హత ఉన్న అభ్యర్థులు జులై 17లోపు అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు ఆన్‌లైన్‌లో అప్లైచేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు..
ఖాళీల వివరాలు:
ఈ రిక్రూట్‌మెంట్‌లో అత్యధికంగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ విభాగంలో 186 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు ఇతర ముఖ్యమైన ఖాళీలు ఇవే..
అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్ – లడఖ్) – 11 పోస్టులు
ఏరోనాటికల్ ఆఫీసర్ – 11 పోస్టులు
లీగల్ ఆఫీసర్ – 12 పోస్టులు
కంపెనీ ప్రాసిక్యూటర్ – 18 పోస్టులు
మరిన్ని మెడికల్ ఆఫీసర్ / స్పెషలిస్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు
విద్యార్హతలు:ఈ పోస్టులు టెక్నికల్, స్పెషలిస్ట్ కేటగిరీకి చెందినవి కాబట్టి పోస్టును బట్టి విద్యార్హతలు మారుతుంటాయి. ముఖ్యంగా B.Pharma, B.Tech/B.E,LLB, MBBS, M.Sc ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు.
వయస్సు:
వయస్సు విషయానికొస్తే.. సాధారణ అభ్యర్థులకు పోస్టును బట్టి 35 నుంచి 40 ఏళ్ల వరకు గరిష్ట వయస్సు ఉండాలి. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, అలాగే దివ్యాంగులకు 10 ఏళ్ల వయోసడలింపు లభిస్తుంది.
ఫీజు వివరాలు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు కేవలం రూ.25 అప్లికేషన్ ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఇక మహిళలు, ఎస్సీ, ఎస్టీ , దివ్యాంగ అభ్యర్థులకైతే ఎలాంటి ఫీజూ లేదు.. ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
సెలక్షన్ ప్రాసెస్, జీతం:
అభ్యర్థుల అప్లికేషన్ సంఖ్యను బట్టి రిక్రూట్‌మెంట్ టెస్ట్ లేదా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ అప్లికేషన్లు ఎక్కువగా వస్తే.. స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇక జీతం విషయానికొస్తే, 7వ పే కమిషన్ ప్రకారం ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-7 నుంచి లెవెల్-11 హోదాలో భారీ జీతంతో పాటు కేంద్ర ప్రభుత్వ అలవెన్సులు కూడా అందుతాయి.
ముఖ్యమైన తేదీలు :
అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 17 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్ upsconline.nic.in సంప్రదించవచ్చు.





