కేంద్ర ప్రభుత్వంలో గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సాధించాలనుకునే వారికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) గుడ్ న్యూస్ అందించింది. ఈ నేపథ్యంలోనే 30కి పైగా కేంద్ర మంత్రిత్వ శాఖలు, సెంట్రల్ హెల్త్ సర్వీసెస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 538 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి 7వ వేతన సంఘం (7th CPC) ప్రకారం లెవెల్-7 నుంచి లెవెల్-14 వరకు మంచి జీతం లభిస్తుంది. అర్హత గల అభ్యర్థులు జులై 3లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
నోటిఫికేషన్ వివరాలు:
మొత్తం పోస్టులు: 538 (98 రకాల విభిన్న పోస్టులు)
ప్రధాన ఖాళీల వివరాలు :
ఈ నోటిఫికేషన్‌లో మెడికల్, టీచింగ్, ఇంజనీరింగ్ , రీసెర్చ్ రంగాలకు చెందిన పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.
స్పెషలిస్ట్ గ్రేడ్ III (అనస్థీషియాలజీ): 75 పోస్టులు (అత్యధిక ఖాళీలు)
అసిస్టెంట్ డైరెక్టర్ గ్రేడ్-II (MSME): 50 పోస్టులు
స్పెషలిస్ట్ గ్రేడ్ III (జనరల్ సర్జరీ/మెడిసిన్): 56 పోస్టులు
ఆపరేషన్స్ ఆఫీసర్ & ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ (DGCA): 34 పోస్టులు
ఇతర పోస్టులు: జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్, అసోసియేట్ ప్రొఫెసర్ (CME పూణే).
అర్హతలు & వయోపరిమితి :
విద్యార్హత: పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్ ఎండీ/పీజీ డిగ్రీ/పీహెచ్డీ/బీఈ/బీటెక్/ఎల్‌ఎల్‌బీ /ఎల్‌ఎల్‌ఎమ్ లేదా ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే 2 నుంచి 10 ఏళ్ల పని అనుభవం అవసరం.
వయస్సు: కనీస వయస్సు 35 ఏళ్లు కాగా, గరిష్ట వయస్సు 59 ఏళ్ల వరకు ఉంది (పోస్టుల వారీగా మారుతుంది). ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయోసడలింపు ఉంటుంది.
అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 3 సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఒకవేళ అప్లికేషన్లు ఎక్కువగా వస్తే రిక్రూట్‌మెంట్ టెస్ట్ నిర్వహించే అవకాశం ఉంది.
అప్లై చేయడం ఎలా?
- అభ్యర్థులు మొదట అధికారిక వెబ్‌సైట్ upsconline.nic.in ఓపెన్ చేయాలి.
- హోమ్‌పేజీలో ఉన్న “New Registration” పై క్లిక్ చేసి మీ వివరాలతో రిజిస్టర్ చేసుకోవాలి.
3.అనంతరం లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి.
4.మీ ఫోటో, సిగ్నేచర్ , అవసరమైన సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
5.అప్లికేషన్ ఫీజు చెల్లించి, ఫామ్‌ను సబ్మిట్ చేసి ప్రింటౌట్ తీసుకోండి.





