యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC).. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ (CGPDTM) విభాగంలో ఎగ్జామినర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 102 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హత నిర్ణయించారు. 21 నుంచి 31 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 13 వ తేదీ నుంచి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ముఖ్య వివరాలు:
సంస్థ పేరు:యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)
పోస్ట్ పేరు- CGPDTM ఎగ్జామినర్ పోస్టులు
మొత్తం పోస్టులు:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎగ్జామినర్ ఆఫ్ ట్రేడ్ మార్క్స్ (TM) & జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్స్ (GI)-100
డిప్యూటీ డైరెక్టర్ (ఎగ్జామినర్ రిఫార్మ్స్)- 02
అర్హతలు:
విద్యార్హత: పోస్టును బట్టి అభ్యర్థులు సంబంధిత విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. ముఖ్యంగా ఎగ్జామినర్ పోస్టులకు లా డిగ్రీ లేదా సంబంధిత రంగంలో అనుభవం అవసరమయ్యే అవకాశం ఉంది. పూర్తి వివరాలు డిసెంబర్ 13 న విడుదలయ్యే పూర్తి నోటిఫికేషన్ ద్వారా వెల్లడిస్తారు.
వయస్సు: అభ్యర్థులు 01-01-2026 నాటికి కనిష్టంగా 21 సంవత్సరాలు, గరిష్టంగా 35 సంవత్సరాల వయస్సు ఉండాలి. OBC, SC/ST, EWS , PwBD అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు రూ. 56,100 – 1,77,500 (పే లెవల్-10) జీతం లభిస్తుంది.
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ: డిసెంబర్ 13 నుంచి అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
చివరి తేదీ: జనవరి 1 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్: upsc.gov.in
అప్లికేషన్ ఫీజు:
జనరల్/OBC/EWS అభ్యర్థులు రూ. 1,000, SC/ST/PwBD, మహిళా అభ్యర్థులు రూ. 500 ప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక కింది దశల ఆధారంగా జరుగుతుంది.
ప్రిలిమినరీ పరీక్ష
మెయిన్ పరీక్ష
ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్
డాక్యుమెంట్ వెరిఫికేషన్
మెడికల్ టెస్ట్
ఎలా అప్లై చేయాలి ?
ముందుగా అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in లోని UPSC ఆన్‌లైన్ రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ (ORA) పోర్టల్‌ను సెలక్ట్ చేసుకోవాలి. వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) పూర్తి చేయాలి. తర్వాత అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ 14/2025 కింద CGPDTM ఎగ్జామినర్ పోస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేసి.. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారంలో అవసరం అయిన వివరాలను ఎంటర్ చేయండి. తర్వాత అవసరం అయిన డాక్యుమెంట్స్ ఫోటో, సంతకం, స్కాన్ చేసిన కాపీలను అప్ లోడ్ చేయండి. ఫీజు చెల్లించి ప్రింటౌట్ తీసుకోండి.





