యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 85 ‘కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామినేషన్-2025’ నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. ఈ పరీక్ష ద్వారా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో కేటగిరీ-1, కేటగిరీ-2 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హత: మాస్టర్ డిగ్రీ (జియోలాజికల్ సైన్స్/ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/ జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ ఇంజినీరింగ్ అప్లైడ్ జియోఫిజిక్స్/ మెరైన్ జియోఫిజిక్స్/ అప్లైడ్ జియోఫిజిక్స్/ కెమిస్ట్రీ/ అప్లైడ్ కెమిస్ట్రీ/ అనలిటికల్ కెమిస్ట్రీ/ హైడ్రోజియాలజీ), ఎంఎస్సీ(టెక్)- అప్లైడ్ జియోఫిజిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు 21 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.200 (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ఎగ్జామ్ ప్యాటర్న్: స్టేజ్ 1- కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (ప్రిలిమినరీ) పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), స్టేజ్ 2-కంబైన్డ్ జియో-సైంటిస్ట్ (మెయిన్) ఎగ్జామినేషన్ (డిస్క్రిప్టివ్ టైప్), స్టేజ్ 3- పర్సనాలిటీ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 9న ప్రిలిమ్స్, జూన్ 21, 22న మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు. వివరాలకు www.upsc.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.