HomeJOBSసివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల

సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్ విడుదల

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 నోటిఫికేషన్ విడుదలైంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి ప్రతిష్టాత్మక సర్వీసుల్లో చేరాలనుకునే అభ్యర్థులకు ఇది అద్భుతమైన అవకాశం. మొత్తం 933 ఖాళీల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి 4 నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమ్స్, మెయిన్స్ , ఇంటర్వ్యూ అనే మూడు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS), ఐఎఫ్ఎస్ (IFS) వంటి సుమారు 24 రకాల గ్రూప్-ఏ, గ్రూప్-బీ సర్వీసుల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు.

ముఖ్యమైన తేదీలు:
అభ్యర్థులు ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఈ పోస్టుల కోసం అప్లై చేసుకోవచ్చు. ప్రిలిమినరీ పరీక్షను మే 24న నిర్వహించనున్నారు.

ఖాళీలు, కేటగిరీలు:
ఈ ఏడాది నోటిఫికేషన్‌లో సుమారు 933 ఖాళీలను ప్రకటించారు. ఇందులో ఆల్ ఇండియా సర్వీసులు, సెంట్రల్ సర్వీసులు గ్రూప్-ఏ , గ్రూప్-బీ పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు కేటాయింపులు ఉంటాయి.

అర్హత,వయస్సు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ పరీక్షకు అర్హులు. ఫైనల్ ఇయర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. వయస్సు 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య (ఆగస్టు 1, 2026 నాటికి) ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.

పరీక్షా విధానం – ప్రిలిమ్స్:
తొలి దశలో ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది.

పేపర్ 1 (GS): 200 మార్కులు. దీని ఆధారంగానే మెయిన్స్‌కు కటాఫ్ నిర్ణయిస్తారు.

పేపర్ 2 (CSAT): 200 మార్కులు. ఇది క్వాలిఫైయింగ్ మాత్రమే (కనీసం 33% మార్కులు రావాలి). తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/3 వంతు నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.

మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ:
మెయిన్స్ పరీక్షలో మొత్తం 9 పేపర్లు ఉంటాయి. రెండు లాంగ్వేజ్ పేపర్లు క్వాలిఫైయింగ్ కాగా, మిగిలిన 7 పేపర్లు (ఎస్సే, 4 జనరల్ స్టడీస్, 2 ఆప్షనల్) మొత్తం 1750 మార్కులకు ఉంటాయి. మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి 275 మార్కులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

అప్లికేషన్ ఫీజు:
జనరల్/ఓబీసీ అభ్యర్థులకు రూ. 100 ఫీజు ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు ఎలాంటి ఫీజు ఉండాలి.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ముందుగా UPSC OTR (One Time Registration) పూర్తి చేయాలి. అనంతరం upsconline.nic.in వెబ్‌సైట్‌లో అప్లికేషన్ పూర్తి చేయాలి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here