HomeLATESTఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్ ​ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​​ సర్వీసెస్​

ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్ ​ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​​ సర్వీసెస్​


యూనియన్​ పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్, ఇండియన్​ ఎకనామిక్​/స్టాటిస్టికల్​ సర్వీసెస్​ ఎగ్జామినేషన్స్​కు వేర్వేరుగా నోటిఫికేషన్స్​ రిలీజ్​ చేసింది. ​ఇంజినీరింగ్​ సర్వీసెస్​ 215, ఎకనామిక్​, స్టాటిస్టికల్​ సర్వీసెస్​ 26 ఖాళీలు ఉన్నాయి.

ఇండియన్​ ఇంజినీరింగ్​ సర్వీసెస్​లో సివిల్​ ఇంజినీరింగ్​, మెకానికల్​ ఇంజినీరింగ్​, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్​, ఎలక్ట్రానిక్స్​ అండ్​ టెలీకమ్యూనికేషన్​ ఇంజినీరింగ్​ విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. ​

అర్హత: ఇంజినీరింగ్​ డిగ్రీ పాసైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఇంజినీర్స్​(ఇండియా)/ ఏరోనాటికల్​ సొసైటీ ఆఫ్​ ఇండియా నిర్వహించే సెక్షన్​ ఏ, సెక్షన్​ బీ ఎగ్జామ్స్​ ఉత్తీర్ణులు; విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి ఇంజనీరింగ్​ డిగ్రీ/డిప్లొమా పూర్తి చేసినవారు, ఐఈటీఈ/ ఇన్​స్టిట్యూషన్​ ఆఫ్​ ఎలక్ట్రానిక్స్​ అండ్​ రేడియో ఇంజనీర్స్​(లండన్​) నుంచి పీజీ మెంబర్​షిప్​ ఉత్తీర్ణులు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎమ్మెస్సీ(వైర్​లెస్​ కమ్యూనికేషన్​ ఎలక్ట్రానిక్స్​, రేడియో ఫిజిక్స్​/రేడియో ఇంజినీరింగ్​), ఎమ్మెస్సీ(ఫిజిక్స్​, రేడియో కమ్యూనికేషన్​/ఎలక్ట్రానిక్స్​/టెలీ కమ్యూనికేషన్​) అభ్యర్థులూ ఈ ఎగ్జామ్​కు అర్హులు.

ఎగ్జామ్​ ప్యాటర్న్: ప్రిలిమినరీ, మెయిన్స్​తోపాటు పర్సనాలిటీ టెస్ట్​ కూడా ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్​లో రెండు ఆబ్జెక్టివ్​ పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్​ 200 మార్కులకు, రెండో పేపర్​ 300 మార్కులకు ఉంటాయి. మొదటి పేపర్​లో జనరల్​ స్టడీస్​, ఇంజినీరింగ్​ ఆప్టిట్యూడ్​ సంబంధిత ప్రశ్నలు, రెండో పేపర్​లో సంబంధిత ఇంజినీరింగ్​ విభాగం నుంచి ప్రశ్నలు ఇస్తారు. మొదటి పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 2 గంటలు, రెండో పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. నెగటివ్​ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు ఆన్సర్​కు వన్​ థర్డ్​ మార్కు కోత విధిస్తారు. ప్రిలిమినరీలో అర్హత సాధించిన వారినే మెయిన్​ ఎగ్జామ్​కు అనుమతిస్తారు. నోటిఫికేషన్​లో ప్రకటించిన ఖాళీలకు ఆరు నుంచి ఏడు రెట్ల అభ్యర్థులను మెయిన్​ ఎగ్జామ్​కు ఎంపిక చేస్తారు. మెయిన్​ ఎగ్జామ్​లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్​ కు 300 చొప్పున మొత్తం 600 మార్కులు. ఒక్కో పేపర్​ ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. వీటిలో సంబంధిత ఇంజినీరింగ్​ విభాగం నుంచి టెక్నికల్​ ప్రశ్నలు ఇస్తారు. మెయిన్​లో అర్హత పొందిన వారిని ఖాళీలకు రెడ్డింపుమందిని సెలెక్ట్​ చేసి పర్సనాలిటీ టెస్ట్​కు ఆహ్వానిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు. ఇందులో అర్హత సాధించిన వారితో ఫైనల్​ లిస్ట్​ విడుదల చేస్తారు.
ఇంజనీరింగ్ సర్వీసెస్​
అప్లికేషన్​ ప్రాసెస్​ ప్రారంభం: ఏప్రిల్​ 7 నుంచి
దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్​ 27
ఎగ్జామ్​ తేది: జులై 18
ఎగ్జామ్​ సెంటర్స్: హైదరాబాద్​, తిరుపతి, విశాఖపట్నం.
వెబ్​సైట్​: www.upsc.gov.in

ఎకనామిక్​/స్టాటిస్టికల్​ సర్వీసెస్​
ఇండియన్​ ఎకనామిక్​ సర్వీసులో 15, స్టాటిస్టికల్​ సర్వీసులో 11 ఖాళీలు ఉన్నాయి.
అర్హత: ఎకనామిక్​ సర్వీస్​కు పీజీ(ఎకనామిక్స్​/అప్లయిడ్​ ఎకనామిక్స్​/బిజిఎస్​ ఎకనామిక్స్​/ ఎకనామెట్రిక్స్​) ఉత్తీర్ణులై ఉండాలి. స్టాటిస్టికల్​ సర్వీస్​ఖు డిగ్రీ/పీజీ(స్టాటిస్టిక్స్​/మేథమెటికల్​ స్టాటిస్టిక్స్​/అప్లయిడ్​ స్టాటిస్టిక్స్​) పూర్తి చేసి ఉండాలి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ఇందులో రెండు విభాగాలు ఉంటాయి. ఎకనామిక్​ సర్సీస్​కు నిర్వహించే రాత పరీక్షలో ఆరు పేపర్లు ఉంటాయి. జనరల్​ ఇంగ్లిష్​(100 మార్కులు), జనరల్​ స్టడీస్​(100 మార్కులు), మూడు జనరల్​ ఎకనామిక్స్​ పేపర్లు(ఒక్కోదానికి 200 మార్కులు), ఇండియన్​ ఎకనామిక్స్​(200 మార్కులు) ఉంటాయి. ఒక్కో పేపర్​కు ఎగ్జామ్​ డ్యురేషన్​ 3 గంటలు. మొత్తం మార్కులు 1000. స్టాటిస్టికల్​ సర్వీస్​కు నిర్వహించే పరీక్షలో జనరల్​ ఇంగ్లిష్​(100 మార్కులు), జనరల్​ స్టడీస్​(100 మార్కులు) సహా నాలుగు స్టాటిస్టిక్స్​ పేపర్లు(ఒక్కోదానికి 200 మార్కులు) ఉంటాయి. రాత పరీక్షలో అర్హత పొందిన వారికి వైవా ఉంటుంది. దీనికి 200 మార్కులు కేటాయించారు.
వయసు: జనవరి 1 నాటికి21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అప్లికేషన్​ ఫీజు: రూ.200(మహిళలు, దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఆన్​లైన్​ దరఖాస్లులు ప్రారంభం: ఏప్రిల్​ 7 నుంచి
చివరి తేది: ఏప్రిల్​ 27
ఎగ్జామ్​ తేది: జులై 16
ఎగ్జామ్​ సెంటర్​: హైదరాబాద్​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!