యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. విడుదల చేసింది. మొత్తం 687 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో ఏప్రిల్ 26 వరకు అప్లై చేసుకోవాలి.
పోస్టులు: సెంట్రల్ హెల్త్ సర్వీస్‌లో జీడీఎంఓ పోస్టులు – 314, అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వేస్) – 300, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూదిల్లీ మున్సిపల్ కౌన్సిల్) – 3, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్ 2 (ఈడీఎంసీ, ఎన్‌డీఎంసీ, ఎస్‌డీఎంసీ) – 70.
అర్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జనరల్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకి లేదు. సీఎంఎస్‌ఈ- ఎగ్జామ్ 17 జులై న నిర్వహిస్తారు. పూర్తి వివరాలకు www.upsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.