కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం సాధించాలనుకునే నిరుద్యోగులకు యూపీఎస్సీ గుడ్ న్యూస్ అందించింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా.. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో.. గ్రూప్-A, గ్రూప్-B పోస్టుల భర్తీ కోసం ‘కంబైండ్ జియో-సైంటిస్ట్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఖాళీలను భరీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఇప్పటికే అప్లికేషన్లు ప్రారంభం కాగా.. సెప్టెంబర్ 22 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
మరిన్ని వివరాలు:
ఖాళీల వివరాలు :ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 కాంట్రాక్ట్ పద్దతిలో ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని రెండు కేటగిరీలుగా విభజించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో జియాలజిస్ట్, కెమిస్ట్, అసిస్టెంట్ జియాలజిస్ట్, అసిస్టెంట్ జియోఫిజిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే.. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డులో సైంటిస్ట్ ‘బి’, అసిస్టెంట్ హైడ్రోజియాలజిస్ట్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి.
విద్యార్హతల, వయో పరిమితి:
సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ (M.Sc లేదా Master’s in Geology/Geophysics/Chemistry/Hydrogeology) పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయసు 1 జనవరి 2027 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ , దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు లభిస్తుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. దీనికోసం యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: ఈ పరీక్షకు అప్లికేషన్ ఫీజు రూ.200గా నిర్ణయించారు. అయితే.. మహిళా అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు. ఓబీసీ , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మాత్రం ఫీజు చెల్లించాలి.
చివరి తేదీ: ఆన్లైన్లో అప్లై చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 22, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంటుంది.
ఎంపిక విధానం:
ఈ పరీక్షను మూడు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశలో ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇది వచ్చే ఏడాది జనవరి 10 న జరుగుతుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ ఎగ్జామ్ జూన్ 19, 20 తేదీల్లో నిర్వహిస్తారు. చివరగా పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ఉంటుంది.
మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ upsconline.nic.in సంప్రదించవచ్చు.





