HomeLATESTసివిల్స్​ ప్రిలిమ్స్ 2023​ ఎలా ప్రిపేర్​ కావాలి..

సివిల్స్​ ప్రిలిమ్స్ 2023​ ఎలా ప్రిపేర్​ కావాలి..

సివిల్స్​ 2023 ప్రిలిమ్స్​ (UPSC CIVILS 2023) ఈ ఏడాది మే 28న జరుగనుంది. యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్​లో మొదటగా ఉండే ప్రిలిమినరీ (CIVILS PRELIMINARY EXAM) చాలా కీలకం. ప్రిలిమ్స్​లో క్వాలిఫై అయితేనే.. అభ్యర్థులు మెయిన్స్​ రాసేందుకు అర్హత సాధిస్తారు. అందుకే ప్రిలిమ్స్​ కు ఎలా ప్రిపేర్​ కావాలి. ఎలా ప్లాన్​ చేసుకోవాలి. ప్రిలిమ్స్​ పేపర్​ ఆబ్జెక్టివ్‌ టైప్‌లో ఉంటుంది కాబట్టి ప్రిలిమ్స్‌ పాసవడం ఈజీగా ఉంటుందని అనుకుంటే అభ్యర్థులు తప్పటడుగు వేసే అవకాశముంది. ప్రిలిమినరీ ఎగ్జామ్​ స్థాయి ఏటేటా యూపీఎస్​సీ పెంచుకుంటూ పోతోంది. దీంతో ఈజీ అనే మాట లేదు. కఠినమైన ప్రశ్నలుంటాయి. అందుకే అభ్యర్థులకు సిలబస్​ మీద లోతైన పట్టు ఉంటేనే ప్రిలిమ్స్​ గట్టెక్కుతారు.

Advertisement

మొదటిసారిగా పరీక్షకు హాజరయ్యేవారికి యూపీఎస్​సీ పరీక్షలంటే భయం ఉంటుంది. అందుకే ప్రాక్టీస్​ ఎక్కువగా చేయాలి. పదో తరగతి తర్వాత సాధారణంగా ఇంజినీరింగ్‌/సైన్స్‌ లేదా కామర్స్‌ సబ్జెక్టులను ఎంచుకున్న అభ్యర్థులు ఉంటారు. ఇవన్నీ కొత్త సబ్జెక్టులే కాబట్టి ప్రాథమికాంశాలపై పట్టు సాధించడం అవసరం. గతంలో జరిగిన పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను అర్థం చేసుకోవాలి.  ప్రశ్నల తీరు ఏటా మారుతూ ఉంటుంది. ప్రశ్నలెలా ఉంటాయనే అవగాహన పెంచుకోవాలి. వాటికి అనుగుణంగా కరెంట్​ అఫైర్స్​ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. పక్కాగా ప్రిపరేషన్​ ప్లాన్​ తయారు చేసుకోవాలి.

ప్రిపరేషన్​ ప్లాన్​ పక్కాగా తయారు చేసుకోవాలి. సిలబస్​ మొత్తం ఒకేచోట గుమ్మరించినట్లు చదివితే అభ్యర్థులు గందరగోళానికి గురవుతారు. అందుకే సబ్జెక్టులు, చాప్టర్ల వారీగా చదువుతూ పోవాలి. ఒక్కో విభాగాన్ని పూర్తి చేయాలి. ముందుగా ఇండియన్‌ పాలిటీ.. తర్వాత ఎకనామిక్స్​.. ఇలా చాప్టర్​ వైజ్ చదవుకుంటూ వెళ్లాలి. ప్రతి చాప్టర్​లో వందలో కనీసం 75 శాతం మార్కులు సాధించేలా ప్రిపేర్​ కావాలి. చాప్టర్​ లన్నీ పూర్తయిన తర్వాత గ్రాండ్‌ టెస్టులు రాయాలి. గ్రాండ్​ టెస్టుల్లోనూ 75 శాతం మార్కులు సాధిస్తే విజయం మీ సొంతమవుతుంది. నెగెటివ్​ మార్కుల కోత లేకుండా.. అభ్యర్థులు నూటికి నూరు శాతం కరెక్టయిన సమాధానాలు గుర్తించే అక్యురసీ పెంచుకోవాలి. తప్పుగా అనిపిస్తే.. ఆ ప్రశ్నను వదిలేయాలి.

ప్రిలిమినరీలో రెండు పేపర్లు 

సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లుంటాయి. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-1, జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2. ప్రతి పేపర్‌కూ 200 మార్కులు. పేపర్‌-1లో 100 ప్రశ్నలు, ప్రతి సరైన జవాబుకు 2 మార్కులు కేటాయిస్తారు. పేపర్‌-2లో 80 ప్రశ్నలు, ప్రతి సరైన సమాధానానికీ 2 1/2 మార్కులు కేటాయిస్తారు. నెగెటివ్‌ మార్కులుంటాయి. ఒక్కో తప్పు సమాధానానికీ 0.33 శాతం మార్కులు కోత.. అంటే మూడు తప్పులకు ఒక మార్కు తగ్గిస్తారు.

Advertisement

పేపర్‌-1

పేపర్‌-1లో అభ్యర్థులకు కేవలం 33 శాతం మార్కులు వస్తే సరిపోతుంది. అంటే మొత్తం 200 మార్కులకు కనీసం 67 మార్కులు సాధించాలి. ఈ మార్కులు సాధించకపోతే అభ్యర్థులు డిస్​ క్వాలిఫై అవుతారు. ఇందులో 33 శాతం కటాఫ్​ కంటే ఎక్కువ మార్కులు వస్తేనే.. పేపర్‌-2ను పరిశీలిస్తారు. అందులో వచ్చే మార్కుల మెరిట్​, రిజర్వేషన్ల కోటా ప్రకారం క్వాలిఫై లిస్ట్ తయారవుతుంది.

* పేపర్‌-1లో 33 శాతం మార్కులు సాధించాలి. అప్పుడే పేపర్‌-1లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

* పేపర్‌-1లో 100కు 40 స్కోర్​ చేసేలా ప్రిపేర్​ కావాలి. మరో 15 ప్రశ్నలు అక్కడున్న సమాధానాల నుంచి సరైన జవాబు గుర్తించేలా నైపుణ్యం సాధించాలి.

Advertisement

* గుడ్డి అంచనాలు వేయవద్దు.   తెలియని ప్రశ్నలకూ సమాధానాలు టిక్​ చేయవద్దు. నెగెటివ్​ మార్కుల కోత లేకుండా అప్రమత్తత పాటించాలి.

పేపర్‌-2

జనరల్‌ స్టడీస్‌ పేపర్‌-2నే సీశాట్‌గా వ్యవహరిస్తుంటారు. ఈ పేపర్‌లో కింది సిలబస్‌ నుంచి 80 ప్రశ్నలు వస్తాయి.

పేపర్‌-2 (200 మార్కులు) సమయం: 2 గంటలు

Advertisement

1. కాంప్రహెన్షన్‌

2. ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌

3. లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ ఎనలిటికల్‌ ఎబిలిటీ

Advertisement

4. డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌

5. జనరల్‌ మెంటల్‌ ఎబిలిటీ

6. బేసిక్‌ న్యూమరసీ (నంబర్స్‌ అండ్‌ దెయిర్‌ రిలేషన్స్‌, ఆర్డర్స్‌ ఆఫ్‌ మేగ్నిట్యూడ్‌.. పదోతరగతి స్థాయి)

Advertisement

7. డేటా ఇంటర్‌ప్రెటేషన్‌ (ఛార్ట్స్‌, గ్రాఫ్స్‌, టేబుల్స్‌, డేటా సఫిషియన్సీ మొదలైనవి – పదోతరగతి స్థాయి)

గత కొన్ని సంవత్సరాలుగా ఇంటర్‌పర్సనల్‌ స్కిల్స్‌, డెసిషన్‌ మేకింగ్‌ల నుంచి ప్రశ్నలు ఇవ్వడం లేదు. వీటికి సరైన సమాధానాలు ఒకటికంటే ఎక్కువగా ఉండటంతో యూపీఎస్‌సీ వీటి నుంచి ప్రశ్నలను అడగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే పద్ధతిని పాటించే అవకాశం ఉంది.

* మ్యాథ్స్‌ బాగా రానివారు ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. షార్ట్‌కట్‌ పద్ధతుల మెలకువలు తెలుసుకోవాలి. మ్యాథ్స్‌ ప్రశ్నలను నిర్లక్ష్యం చేయడమో, వాయిదా వేయడమో చేయకూడదు. 

Advertisement

* పేపర్‌-1 కంటే ముందుగానే పేపర్‌-2 సన్నద్ధతను మొదలుపెట్టాలి. ఎందుకంటే.. ఈ పేపర్‌ రాయడానికి అవసరమైన నైపుణ్యాలను రాత్రికి రాత్రే సాధించే అవకాశం ఉండదు.

పేపర్‌-1 సిలబస్‌: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ సిలబస్‌ చాలా జనరల్‌గా ఉంటుంది. అందుకే ఏ సబ్జెక్టులో ఏ అంశాలు వస్తాయో అంచనా వేయటం కష్టం.

ప్రశ్నలెలా అడుగుతారు

* అభ్యర్థుల ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే ప్రశ్నలు ప్రిలిమినరీలో ఉంటాయి. ప్రధానంగా కరెంట్‌ అఫైర్స్‌ బేస్​ చేసుకొని.. అందులో నుంచి ఉత్పన్నమయ్యే వివిధ కోణాల ప్రశ్నలు అడుగుతారు. వర్తమాన అంశాలపై అభ్యర్థికి ఉన్న అవగాహనను అంచనాను వేసేందుకు ఈ ప్రశ్నలు అడుగుతారు.

Advertisement

* జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో అభ్యర్థికి ఎంత పరిణతి ఉందో తెలుసుకునే ప్రశ్నలుంటాయి. వీటికి తోడు అభ్యర్థులకు సమాజంపై ఉన్న అవగాహనను పరీక్షిస్తారు. ప్రజలు ఎదుర్కొంటోన్న సమస్యలు, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి ప్రశ్నల కూర్పు ఉంటుంది.

* జాతీయంగా, అంతర్జాతీయ కార్యక్రమాలు. అవి సామాన్య ప్రజలపై చూపే ప్రభావం ఎలా ఉంటుందనే కోణంలో ప్రశ్నలు అడిగే చాన్స్​ ఉంటుంది. 

* భవిష్యత్తు కార్యక్రమాలపై ప్రభుత్వ వైఖరి, వాటి సాధనకు చేస్తోన్న కృషిపై అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే ప్రశ్నలు అడుగుతారు. 

Advertisement

* ప్రశ్నలు కనీస తార్కిక పరిజ్ఞానాన్ని, విశ్లేషణ సామర్థ్యాన్నీ పరీక్షించేలా ప్రశ్నలుంటాయి.

* పేపర్‌-2లో కనీస మార్కులు సాధించాలి. అప్పుడే పేపర్‌-1లో పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. 

* మరో 15 ప్రశ్నలకు సమాధానాలు సరిగ్గా ఊహించి రాసే నైపుణ్యం సంపాదించాలి. 

* సమాధానాల విషయంలో గుడ్డిగా అంచనాలు వేయకుండా స్వీయ క్రమశిక్షణను పాటించాలి. 

* ఒత్తిడికి గురై తెలియని ప్రశ్నలకూ సమాధానాలు రాసేయకుండా అప్రమత్తత పాటించాలి.

అభ్యర్థి సరైన సన్నద్ధత వ్యూహానికి.. మౌలిక అంశాల నుంచి మొదలుపెట్టడం ఎంతో అవసరం. సిలబస్‌ను సమగ్రంగా పరిశీలించి ప్రశ్నపత్రంలో వస్తున్న ధోరణులను అర్థం చేసుకోవాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!