యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలివే..

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) ఈరోజు రెండు ప్రముఖ ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమనరీ ఎగ్జామినేషన్-2023, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023 నోటిఫికేషన్ ను యూపీఎస్సీ తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫిబ్రవరి 21వ తేదీలోగా సమర్పించాలని ప్రకటనలో పేర్కొన్నారు. ప్రిలిమనరీ పరీక్ష మే 28న నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పూర్తి నోటిఫికేషన్ ను యూపీఎస్సీ వెబ్ సైట్  https://www.upsc.gov.in/ లో చూడొచ్చు. Advertisement