HomeLATEST344 ఖాళీలతో సీడీఎస్ నోటిఫికేషన్​: ఆగస్ట్ 25 వరకు ఛాన్స్​

344 ఖాళీలతో సీడీఎస్ నోటిఫికేషన్​: ఆగస్ట్ 25 వరకు ఛాన్స్​

యూపీఎస్​సీ ఈ ఏడాదికి సంబంధించి సీడీఎస్​–2 (కంబైండ్ డిఫెన్స్ సర్వీసెస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ పూర్తయిన అభ్యర్థులందరూ దీనికి అర్హులే. ఆసక్తి అర్హతలున్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ఆగస్ట్ 25 వ తేదీ వరకు దరఖాస్తులు దాఖలు చేయవచ్చు. మొత్తం 344 ఖాళీలను ఈసారి భర్తీ చేసేలా నోటిఫికేషన్​ జారీ చేసింది.

ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌లో చేరాలని కలలు కనే యువతకు అద్భుత అవకాశం. సీడీఎస్‌ ఎగ్జామ్​ను యూపీఎస్​సీ ఏటా రెండుసార్లు జనవరి/ఫిబ్రవరి మరియు నవంబర్‍/డిసెంబర్‍ లో నిర్వహిస్తుంది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ అకాడమీ (ఐఎంఏ), నేవల్​ అకాడమీ (ఎన్‌ఏ), ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌ (ఐఏ), ఆఫీసర్స్ ట్రైనింగ్‍ అకాడమీ (ఓటీఏ)ల్లో సమాన హోదా కలిగిన ఆఫీసర్ ఉద్యోగాల్లో ప్రవేశించవచ్చు.

Advertisement

తాజా నోటిఫికేషన్​లో భర్తీ చేసే సీట్లు

  • ఇండియన్ మిలటరీ అకాడమీ డెహ్రాడూన్ 100 పోస్ఖులు
  • ఇండియన్ నావల్ అకాడమీ,ఎజిమాల్ లో 26 పోస్టులు
  • ఎయిర్ ఫోర్స్ అకాడమీ,హైదరాబాద్ లో 32 పోస్టులు
  • అఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ,చెన్నై లో 169 పోస్టులు
  • ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీఫర్ ఉమెన్ చెన్నై లో 17 పోస్టులు

అప్లికేషన్లు; ఆగస్ట్ 5 నుంచి ఆగస్ట్ 25 వరకు
రాత పరీక్ష; నవంబర్ 8 వ తేదీన జరగనుంది.
పరీక్షా కేంద్రాలు; తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, తిరుపతి, విశాఖపట్నం.
పూర్తి వివరాలు https://www.upsc.gov.in/ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

సెలెక్షన్​ ప్రాసెస్​
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు. స్టేజ్-1లో మూడు పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నాపత్రం ఇంగ్లిష్/హిందీ మాధ్యమాల్లో ముద్రిస్తారు. ఇందులో క్వాలిఫై అయిన వారికి స్టేజ్‍-2 లో సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ కండక్ట్‌ చేస్తుంది. నెగెటివ్​ మార్కులున్నాయి. 0.33 శాతం కోత విధిస్తారు. ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో పదోతరగతి స్థాయిలో ప్రశ్నలిస్తుండగా మిగిలిన సబ్జెక్టుల్లో డిగ్రీ లెవెల్‌ క్వశ్చన్స్‌ వస్తాయి.

Advertisement

ఫిజికల్​ మెజర్‌‌మెంట్స్‌
ఆర్మీకి దరఖాస్తు చేసేవారు కనీసం 157.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. నేవీకి 157, ఎయిర్​ఫోర్స్​కు 162.5, ఆఫీసర్స్​ వుమెన్​ కు 152 సెం.మీ.ఎత్తు తప్పనిసరి. శ్వాస పీల్చినప్పుడు ఛాతి 5 సెం.మీ విస్తరించాలి. ఎయిర్​ఫోర్స్​, నేవీకి దరఖాస్తు చేసినవారికి పైలట్​ ఆప్టిట్యూడ్​ బ్యాటరీ టెస్ట్​ (పీఏబీటీ) నిర్వహిస్తారు. ఈ టెస్టులో ఫెయిలైనవారు, కళ్లద్దాలు ధరించే అలవాటున్న అభ్యర్థులు ఎయిర్​ఫోర్స్​కు అనర్హులు.

టిప్స్​ ఫర్​ సక్సెస్​
ఇంగ్లిష్
అభ్యర్థి బేసిక్ ఇంగ్లిష్ నాలెడ్జ్​ను పరీక్షిస్తారు. గ్రామర్‍, ఆంటోనిమ్స్, సిననిమ్స్, ఆర్టికల్స్, వాయిస్‍, ప్రిపొజిషన్స్, టెన్సెస్, కాంప్రహెన్సన్, వంటి వాటి నుంచి డిగ్రీ స్టాండార్డ్​లో ప్రశ్నలిస్తారు. ఇంగ్లిష్ పేపర్ చదవడం, న్యూస్ వినడం వల్ల వొకాబులరీ పెంచుకోవచ్చు. రోజుకు కొన్ని కొత్త పదాలు వాటిని ఉపయోగించి వాక్యాలు సాధన చేయాలి. డిక్షనరీ సహాయంతో చదివితే త్వరగా నేర్చుకోవచ్చు. రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లిష్ గ్రామర్ పుస్తకం ఇందుకు ఉపకరిస్తుంది.

జనరల్‍ నాలెడ్జ్​
జీకే విభాగంలో కరెంట్​ అఫైర్స్​తో పాటు జియోగ్రఫీ, చరిత్ర, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ర్టీ, ఫిజిక్స్, సైన్స్ అండ్‍ టెక్నాలజీ టాపిక్​ల నుండి డిగ్రీ స్థాయిలో ప్రశ్నలిస్తారు. నిత్యజీవితానికి దగ్గరగా ఉన్నవి, నిత్యం గమనిస్తూ ఉన్న అంశాలే ప్రశ్నలవుతాయి. వీటికి అదనంగా స్టాండర్డ్​ జీకే టాపిక్స్ అయిన దేశాల రాజధానులు, కరెన్సీలు వివిధ దేశాల అధిపతులు, దినోత్సవాలు, పదజాలాలు, నదీతీర నగరాలు, వివిధ అంతర్జాతీయ సంస్థలు, ప్రధాన సరిహద్దు రేఖలు, వివిధ రంగాల్లో ప్రథములు, ప్రపంచంలో ఎత్తైనవి, పెద్దవి, పొడవైనవి, ప్రముఖుల బిరుదులు, మారుపేర్లు, జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటి సమాచారాన్ని చదవాలి. ఖండాలు, సరస్సులు, నదులు, సముద్రాలు, గ్రహాలు, దేశాల సరిహద్దులు, ప్రాజెక్టులు వంటి వాటినీ వదలకూడదు. ప్రీవియస్‍ పేపర్ల సహాయంతో ఏ సబ్జెక్టు నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయో గుర్తించి క్షుణ్నంగా చదవగలిగితే ఇందులో మంచి మార్కులు పొందే అవకాశం ఉంది. ఇందుకు ఎన్‌సీఈఆర్‌టీ 8, 9, 10 పదోతరగతి పుస్తకాల్లో ఉండే చాప్టర్లు చాలా ఉపయుక్తం

Advertisement

ఎలిమెంటరీ మ్యాథ్స్
మ్యాథ్స్​లో పదో తరగతి స్టాండర్డ్​ ప్రశ్నలు వస్తాయి. నంబర్‍ సిస్టమ్స్, ఇంటిజర్స్​, వోల్‍ నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, సంఖ్యల మధ్య సంబంధం, బేసిక్‍ ఆరిథ్‍మెటిక్‍ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, వడ్డీ, లాభనష్టాలు, డిస్కౌంట్లు, టేబుల్స్, గ్రాఫ్‍లు, మెన్సురేషన్, కాలం-దూరం, నిష్పత్తి-కాలం, కాలం-పని వంటి టాపిక్స్​ బాగా చూసుకోవాలి. ఆర్‍ఎస్‍ అగర్వాల్‍ క్వాంటిటేటివ్​ యాప్టిట్యూడ్​, ఆబ్జెక్టివ్ అర్థమెటిక్, ఎన్​సీఈఆర్​టీ పుస్తకాల్లో ఉన్న మోడల్స్​ బాగా సాధన చేయాలి. ప్రీవియస్‍ పేపర్లు సాధన చేయడం వల్ల క్వశ్చన్‍ ప్యాటర్న్ తెలిసి ప్రిపరేషన్​ సులువవుతుంది. ఎగ్జామ్​కు ముందు కొన్ని ఆన్​లైన్​ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకుంటే మంచిది.

పర్సనాలిటీ టెస్ట్​
ఇందులో రెండు దశల్లో సైకోమెట్రిక్ టెస్టులు నిర్వహిస్తారు. మొదటి దశలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ రేటింగ్​ టెస్ట్స్, పిక్చర్ పర్సెప్షన్ డిస్ర్కిప్షన్ టెస్ట్ ఉంటుంది. వీటిలో క్వాలిఫై అయితే రెండోదశలో ఇంటర్వ్యూ, గ్రూప్ టెస్టింగ్​ ఆఫీసర్‌‌ టాస్క్స్, సైకాలజీ టెస్ట్స్‌ కండక్ట్‌ చేస్తారు. దాదాపు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ టెస్టుల్లో ఏదైనా సందర్భానికి అభ్యర్థి స్పందన ఏ విధంగా ఉంటుందో తెలుసుకుంటారు. ఇందుకుగాను భయం, జంకు లేకుండా ఎవరి ముందైనా మాట్లాడేలా సాధన చేయాలి. ఏదైనా టాపిక్​ను ప్రిపేరయి సొంతంగా స్పీచ్​ ఇవ్వడం వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్​ పెంచుకోవాలి. ఇంగ్లిష్​లో మాట్లాడటానికి ప్రయత్నించాలి. న్యూస్​, ఇతర చర్చలు వింటూ ఎప్పుడు, ఎలా మాట్లాడుతున్నారో గమనించాలి. వొకాబులరీ పెంచుకుంటూ సాధన చేస్తే సులువుగా నేర్చుకోవచ్చు. నిరంతరం మాట్లాడుతుంటం వల్ల గ్రూప్​ డిస్కషన్‌ను​ కూడా ఎదుర్కోవచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!