HomeJOBSయూపీఎస్‌సీ సీడీఎస్-2 నోటిఫికేషన్ విడుదల

యూపీఎస్‌సీ సీడీఎస్-2 నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)గుడ్ న్యూస్ అందించింది. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (CDS II) ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్‌ను యూపీఎస్‌సీ అధికారికంగా విడుదల చేసింది. దీని ద్వారా ఇండియన్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలలో ఖాళీగా ఉన్న 451 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత , ఆసక్తి ఉన్న అవివాహిత అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టుల వివరాలు:
ఈ నోటిఫికేషన్ లోని మొత్తం 451 ఖాళీలలో తెలంగాణ అభ్యర్థులకు ఒక ప్రత్యేకమైన అవకాశం ఉంది. హైదరాబాద్ (దుండిగల్)లోని ప్రసిద్ధ ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA) లో 222 ఎఫ్(పీ) కోర్సు కింద 32 పోస్టులను కేటాయించారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి హైదరాబాద్ లోనే ప్రతిష్టాత్మకమైన ప్రీ-ఫ్లయింగ్ శిక్షణ లభిస్తుంది. దీంతో పాటు ఇండియన్ మిలిటరీ అకాడమీ (IMA) లో 100 పోస్టులు, ఇండియన్ నేవల్ అకాడమీ (INA) లో 26 పోస్టులు, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ (OTA) చెన్నై పురుషులకు 275, మహిళలకు 18 పోస్టులు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు, అప్లికేషన్ విధానం:
ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ జూన్ 9(సాయంత్రం 6:00 గంటల వరకు) మాత్రమే. ఈ రాత పరీక్షను సెప్టెంబర్ 13 న దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో నిర్వహించనున్నారు. రాత పరీక్ష ఫలితాలు అక్టోబర్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

అర్హతలు:
ఐఎంఏ , ఓటీఏ పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇండియన్ నేవల్ అకాడమీ పోస్టులకు ఇంజనీరింగ్ డిగ్రీ లేదా ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ పోస్టులకు ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు కలిగి ఉండి, ఏదైనా డిగ్రీ లేదా బీఈ/బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.

వయోపరిమితి:
కోర్సును బట్టి అభ్యర్థుల వయస్సు 19 నుంచి 25 సంవత్సరాల లోపు ఉండాలి. ఎయిర్ ఫోర్స్ అకాడమీకి జూలై 2, 2003.. జూలై 1, 2007 మధ్య జన్మించిన పురుషులు అర్హులు.

స్టైపెండ్:

ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 56,100 స్టైపెండ్ లభిస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న తర్వాత లెవెల్ 10 హోదాలో జీతం లభిస్తుంది.

అప్లికేషన్ ఫీజు:
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు రూ. 200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ , మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

ఎంపిక విధానం:
అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. మొదట యూపీఎస్‌సీ నిర్వహించే రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ (SSB) ద్వారా ఇంటెలిజెన్స్ , పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) నిర్వహిస్తారు. చివరి దశలో మెడికల్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా అకాడమీలకు ఎంపిక చేస్తారు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here