HomeJOBSహైదరాబాద్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

హైదరాబాద్ యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే!

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 40 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలని యూనివర్సిటీ సూచించింది. పీహెచ్‌డీ (Ph.D) లేదా మాస్టర్స్ డిగ్రీతో పాటు నెట్ ఉత్తీర్ణత కలిగిన వారికి ఇది అద్భుతమైన అవకాశం. మార్చి 6 వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

పూర్తి వివరాలు:
ప్రొఫెసర్ (లెవల్-14): 17 పోస్టులు

అసోసియేట్ ప్రొఫెసర్ (లెవల్-13A): 20 పోస్టులు

అసిస్టెంట్ ప్రొఫెసర్ (లెవల్-10): 03 పోస్టులు

అర్హతలు:
అసిస్టెంట్ ప్రొఫెసర్:
సంబంధిత సబ్జెక్టులో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. అలాగే UGC/CSIR నిర్వహించే NET లేదా SET/SLET లో ఉత్తీర్ణత సాధించాలి. పీహెచ్‌డీ (UGC 2009/2016 నిబంధనల ప్రకారం) ఉన్నవారికి నెట్ నుంచి మినహాయింపు ఉంటుంది.

అసోసియేట్/ప్రొఫెసర్: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీతో పాటు బోధన లేదా పరిశోధన రంగంలో నిర్ణీత అనుభవం (8 నుంచి10 ఏళ్లు), పబ్లికేషన్స్ అవసరం.

వయస్సు: అభ్యర్థుల వయస్సు 21 నుంచి 65ఏళ్ల మధ్య ఉండాలి.

అప్లికేషన్ చివరి తేదీ:
అభ్యర్థులు మార్చి6వ తేదీ వరకు ఈ ఉద్యోగాల కోం అప్లై చేసుకోవచ్చు.

అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ uohyd.ac.in లో నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ సమర్థ్ (Samarth) పోర్టల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. కేవలం ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే కాకుండా, దాని ప్రింటవుట్‌ను అవసరమైన సర్టిఫికెట్లతో జతచేసి మార్చి 10 లోపు యూనివర్సిటీకి పంపాలి.

ఎంపిక విధానం: అభ్యర్థుల అకడమిక్ రికార్డు, రీసెర్చ్ స్కోర్, పబ్లికేషన్స్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన వారికి ఇంటర్వ్యూ లేదా సెమినార్/డెమో లెక్చర్ నిర్వహించి ఫైనల్ లిస్ట్ ప్రకటిస్తారు.

అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్ సైట్ uohyd.ac.in సంప్రదించవచ్చు.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here