యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (UOH) వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 52 నాన్-టీచింగ్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ అర్హతతో పాటు పని అనుభవం ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. అక్టోబర్ 24 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని వివరాలు:
మొత్తం ఖాళీలు- 52
పోస్టుల వారిగా..
అసిస్టెంట్ లైబ్రేరియన్-04
అసిస్టెంట్ రిజిస్ట్రార్-01
సిస్టం ప్రోగ్రామర్-02
సీనియర్ అసిస్టెంట్-05
ఆఫీస్ అసిస్టెంట్-07
ల్యాబ్ అసిస్టెంట్-10
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్-15
ల్యాబ్ అటెండెంట్-05
లైబ్రరీ అటెండెంట్-03
ముఖ్యమైన అర్హతలు:
విద్యార్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, ఎంటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా తప్పనిసరి.
వయస్సు(గరిష్ఠ వయస్సు):
అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు- 62 ఏళ్లు
అసిస్టెంట్ రిజిస్ట్రార్, సిస్టం ప్రోగ్రామర్- 40 ఏళ్లు
సీనియర్ అసిస్టెంట్- 35 ఏళ్లు
మిగతా పోస్టులన్నింటికీ- 32 ఏళ్లు.
జీతం (నెలకు):
అసిస్టెంట్ లైబ్రేరియన్, రిజిస్ట్రార్, సిస్టం ప్రోగ్రామర్ పోస్టులు- రూ.57,700 – 1,82,400.
సీనియర్ అసిస్టెంట్ పోస్టులు – రూ.35,400 – రూ.1,12,400.
ఆఫీస్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులు – రూ.25,500 – రూ.81,100.
జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు – రూ.19,900 – రూ.63,200.
ల్యాబ్ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్- రూ.18,000 – రూ.56,900.
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. రూ.500 చెల్లించాలి. ఇతర అభ్యర్థులు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది.
అప్లికేషన్ విధానం:
అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
రాత పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
మరిన్ని వివరాల కోసం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.





