హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (UoH) 2026-28 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీఏ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. క్యాట్, మ్యాట్ లేదా సీమ్యాట్ వంటి జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల్లో స్కోరు సాధించిన అభ్యర్థులు ఈ ప్రతిష్టాత్మక కోర్సులో చేరడానికి అర్హులు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జనవరి 31 లోపు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
కోర్సు వివరాలు, సీట్ల సంఖ్య:
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెండేళ్ల ఫుల్ టైం ఎంబీఏ (MBA) ప్రోగ్రామ్‌ను అందిస్తోంది. మొత్తం సీట్ల సంఖ్య 75.
అర్హతలు:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అభ్యర్థులు ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా కింద పేర్కొన్న పరీక్షల్లో ఏదో ఒక దానికి హాజరై ఉండాలి.
CAT 2025
MAT 2025
CMAT 2026
ఎంపిక విధానం:
అప్లై చేసుకున్న అభ్యర్థులను వారు జాతీయ స్థాయి పరీక్షల్లో సాధించిన స్కోరు ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం వీరికి గ్రూప్ డిస్కషన్ (GD), పర్సనల్ ఇంటర్వ్యూ (PI) నిర్వహిస్తారు. అకాడమిక్ రికార్డ్, ఎంట్రన్స్ స్కోర్ , ఇంటర్వ్యూ ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
అభ్యర్థుల కేటగిరీని బట్టి ఫీజు వివరాలు: జనరల్ అభ్యర్థులు రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ. 550 ఓబీసీ రూ. 400, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులు రూ. 275 చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
అప్లికేషన్లకు చివరి తేదీ: 31 జనవరి వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్‌ను సంప్రదించవచ్చు.





