హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (UOH) 2026-27 విద్యా సంవత్సరానికి గానూ యూజీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేసింది. కాగా మొత్తం 17 రకాల కోర్సుల్లో.. అందుబాటులో ఉన్న 470 సీట్ల భర్తీకి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియను ప్రారంభించింది. సీయూఈటీ (UG)2026 స్కోర్ సాధించిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. జులై 7 నుంచి ప్రారంభమైన ఈ అప్లికేషన్లు ప్రక్రియ జులై 21 వరకు కొనసాగుతుంది.
ఎంపిక విధానం:
ఈ కోర్సుల్లో ప్రవేశాలు పూర్తిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన సీయూఈటీ (CUET UG-2026)స్కోర్ల ఆధారంగానే జరుగుతాయి. అర్హత గల అభ్యర్థులు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు చట్టబద్ధమైన రిజర్వేషన్లు వర్తిస్తాయి.
అందుబాటులో ఉన్న కోర్సులు:
4 సంవత్సరాల కోర్సులు: బీఎస్సీ (కెమిస్ట్రీ).
5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎమ్మస్సీ (M.Sc): మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సిస్టమ్స్ బయోలజీ, ప్లాంట్ బయోలాజికల్ సైన్సెస్ తదితర విభాగాలు.
5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఎంఏ (M.A):హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీతో పాటు ప్రాంతీయ భాషలైన తెలుగు, హిందీ, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్.
ముఖ్యమైన తేదీల వివరాలు:
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: జులై 7 నుంచి అప్లికేషన్లు ప్రారంభం అయ్యాయి.
అప్లికేషన్లకు చివరి తేదీ: జులై 21 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
కౌన్సెలింగ్ లిస్ట్ ప్రకటన: ఆగస్టు 3 న ఫైనల్ లిస్ట్ విడుదల చేస్తారు.
సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేదీలు: ఆగస్టు 13, 14 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుంది.
తరగతుల ప్రారంభం: ఆగస్టు 17 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయి.
అప్లై చేసుకునే విధానం:అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జులై 21 లోపు యూనివర్సిటీ అధికారిక పోర్టల్స్ ద్వారా ఆన్‌లైన్ ఫారమ్‌ను పూర్తి చేయాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో.. ఒరిజినల్ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది.





