యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI)’యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2026–27′ కింద ఏకంగా 395 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్ ఆఫీసర్లు (IT, ఫారెక్స్, లా, CA తదితర రంగాలు) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. మేనేజర్ నుంచి డిప్యూటీ జనరల్ మేనేజర్ స్థాయి పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. పోస్టులను బట్టి విద్యార్హతలు నిర్ణయించారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించి మరిన్ని వివరాలు.
అర్హతలు & వయోపరిమితి :
పోస్టును బట్టి సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, బీఈ/బీటెక్,ఎంసీఏ, ఎంబీఏ, లేదా సీఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం తప్పనిసరి.
వయస్సు: పోస్టు కేడర్‌ను బట్టి కనిష్టంగా 22 ఏళ్ల నుంచి గరిష్టంగా 50 ఏళ్ల వరకు ఉండొచ్చు. ఎస్టీ,ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు:
జనరల్,ఓబీసీ అభ్యర్థులకు అప్లికేషన్ ఫీజు రూ.1,180 కాగా.. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.177 చెల్లించాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం:
స్కేల్-III వరకు ఉన్న పోస్టులకు ఆన్లైన్ పరీక్ష (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు), ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్షలో ప్రొఫెషనల్ నాలెడ్జ్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. నెగెటివ్ మార్కింగ్ (0.25) విధానం అమలులో ఉంటుంది. ఇక స్కేల్-IV, అంతకంటే పై స్థాయి పోస్టులకు నేరుగా షార్ట్‌లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్ లేదా పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
అప్లికేషన్లకు చివరి తేదీ: ఆగస్ట్ 10వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేయాలి?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ (www.unionbankofindia.co.in)లో ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.





