బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే.. అభ్యర్థులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (UBI) గొప్ప అవకాశాన్ని కల్పించింది. 2026 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో 1865 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి కలిగి ఉన్న వారు ఏప్రిల్ 29 నుంచి మే 19 వరకు ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు :
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1865 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఏపీలో 303, తెలంగాణలో 164 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత:
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 01-04-2022 తర్వాత డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు.
వయస్సు:
01-04-2026 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయో సడలింపు ఉంటుంది.
స్థానిక భాష:
అభ్యర్థి ఏ రాష్ట్రానికి అప్లై చేస్తున్నారో, ఆ రాష్ట్ర స్థానిక భాషలో ప్రావీణ్యం (చదవడం, రాయడం, మాట్లాడటం) కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది.
ఆన్‌లైన్ పరీక్ష: 100 మార్కులకు ఆబ్జెక్టివ్ తరహాలో పరీక్ష ఉంటుంది. ఇందులో జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, కంప్యూటర్ నాలెడ్జ్, యూనియన్ బ్యాంక్ గురించి ప్రశ్నలు ఉంటాయి. 60 నిమిషాల పాటు సమయం ఉంటుంది. నెగటివ్ మార్కింగ్ లేవు.
స్థానిక భాషా పరీక్ష: టెన్త్ లేదా ఇంటర్‌లో స్థానిక భాష చదవని వారు ఈ పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది.
స్టైపెండ్ వివరాలు:
శిక్షణ పొందే ప్రాంతాన్ని బట్టి అభ్యర్థులకు స్టైపెండ్ చెల్లిస్తారు.
గ్రామీణ/సెమీ అర్బన్: రూ. 15,000
అర్బన్: రూ. 18,000
మెట్రో సిటీలు: రూ. 20,000
ఆసక్తి గల అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ లేదా BFSI SSC పోర్టల్ ద్వారా చివరి తేదీ లోపు అప్లై చేసుకోవాలి.





