Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsనారాయణపేట ఎస్ పీ కుమార్తెకు సివిల్స్ లో మూడో ర్యాంక్.. టాప్ 20 ర్యాంకర్లు వీరే

నారాయణపేట ఎస్ పీ కుమార్తెకు సివిల్స్ లో మూడో ర్యాంక్.. టాప్ 20 ర్యాంకర్లు వీరే

ఇప్పుడే రిలీజైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులుల సత్తా చాటారు. ఈ ఫలితాల్లో నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు, – శ్రీదేవి దంపతుల కుమార్తె నూకల ఉమా హారతి జాతీయస్థాయిలో మూడవ ర్యాంకు సాధించింది. ఈ విషయాన్ని రామగుండం కమిషినర్ రెమా రాజేశ్వరీ ట్విట్టర్ లో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు.

Advertisement

హైదరాబాద్‌లో ఐఐటీ కంప్లీట్ చేసిన ఉమా హారతి తన నాలుగవ ప్రయత్నంలో ఈ ఘనతను సాధించింది. ఉమా హారతి సోదరుడు సాయి వికాస్ 2021వ సంవత్సరంలో ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్‌లో జాతీయస్థాయిలో 12వ ర్యాంకును సాధించి శిక్షణ పూర్తి చేసుకొని ఈనెల 22వ తేదీన విధులలో చేరాడు.

సివిల్ సర్వీసెస్‌లో మూడవ ర్యాంకును సాధించిన ఉమా హారతి‌తో పాటు, ఆమె తల్లిదండ్రులకు పోలీస్ ఉన్నతాధికారులు, సిబ్బంది, విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

*ఎన్నో ఫెయిల్యూర్స్‌ చూశా.. నాన్నే నాకు స్ఫూర్తి: సివిల్స్‌ టాపర్‌ ఉమా హారతి*

Advertisement

‘‘ఏదో ఒక ర్యాంకు వస్తే చాలనుకున్నాను. మూడో ర్యాంకు వస్తుందని మాత్రం అస్సలు ఊహించలేదు. రోజూ ఏడెనిమిది గంటల పాటు చదివేదాన్ని. ముందుగా జాగ్రఫీ ఆప్షనల్‌ సబ్జెక్టు ఉండేది. ఆ తర్వాత ఆంత్రోపాలజీకి మారాను. ఐదేళ్లుగా నేను ప్రిపేర్‌ అవుతున్నాను. ఈ ప్రాసెస్‌లో కుటుంబ సభ్యుల సపోర్టు, ఎమోషనల్‌ సపోర్టు చాలా అవసరం. అది ఉంటే చాలు. సమాచారం, పుస్తకాలు.. అన్నీ ఆన్‌లైన్‌లో ఉచితంగా దొరుకుతాయి. కానీ ఎమోషనల్‌, ఫ్యామిలీ సపోర్టు మాత్రం దొరకదు కదా.. అదే చాలా అవసరం. మహిళలు, పురుషులు ఎవరైనా సరే.. కుటుంబం సపోర్టు చేస్తే సాధించవచ్చు’’

‘‘ఒకవేళ పరీక్షల్లో ఫెయిల్‌ అయినా నిరాశ పడొద్దు. ఎవరి నుంచైనా మనం స్ఫూర్తిపొందవచ్చు. నేను ఐదేళ్ల నుంచి ప్రిపేర్‌ అవుతున్నా. ఈ పరీక్ష ప్రక్రియలో చాలా ఫెయిల్యూర్స్‌ చూశాను. అదే పనిగా విశ్వాసంతో చదువుతూ వెళ్లాను.. నేను ఐఐటీ హైదరాబాద్‌లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత ఉద్యోగంలో చేరలేదు. సివిల్స్‌ వైపు వెళ్లాలని ముందునుంచీ ఉండటంతో దానిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టాను. నా తల్లిదండ్రులు కూడా చాలా సపోర్టు ఇచ్చారు. సివిల్స్‌ సాధించే వరకు రాద్దామని నిర్ణయించుకొని రాశాను. నా ఫ్రెండ్స్‌ చాలా సపోర్టు చేశారు. *నూటికి నూరు శాతం మా నాన్నే నాకు స్ఫూర్తి, ప్రేరణ.*

సత్తాచాటిన జగిత్యాల జిల్లా ఐలాపూర్ యువకుడు*

Advertisement

ఏనుగు శివ మారుతీ రెడ్డి సివిల్స్ లో సత్తా చాటాడు. UPSC ఎగ్జాం ఆల్ ఇండియా లెవెల్లో 132 వ ర్యాంకు సాధించాడు. శివ మారుతీ రెడ్డిది జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామం.

శాఖమూరి శ్రీ సాయి ఆశ్రిత్ UPSC 2022 ఫలితాలలో ఆల్ ఇండియా 40 వ ర్యాంకు సాధించాడు. 22 ఏళ్ల వయస్సులో మొదటి ప్రయత్నంలోనే ర్యాంకును సాధించిన సాయి ఆశ్రిత్ హన్మకొండ కు చెందిన శాఖమూరి అమర్ – పద్మజ దంపతుల కుమారుడు.

Top 20 Candidates of UPSC

Advertisement

1 5809986 ISHITA KISHORE
2 1506175 GARIMA LOHIA
3 1019872 UMA HARATHI N
4 0858695 SMRITI MISHRA
5 0906457 MAYUR HAZARIKA
6 2409491 GAHANA NAVYA JAMES
7 1802522 WASEEM AHMAD BHAT
8 0853004 ANIRUDDH YADAV
9 3517201 KANIKA GOYAL
10 0205139 RAHUL SRIVASTAVA
11 3407299 PARSANJEET KOUR
12 6302509 ABHINAV SIWACH
13 2623117 VIDUSHI SINGH
14 6310372 KRITIKA GOYAL
15 6802148 SWATI SHARMA
16 6017293 SHISHIR KUMAR SINGH
17 0840388 AVINASH KUMAR
18 0835555 SIDDHARTH SHUKLA
19 0886301 LAGHIMA TIWARI
20 7815000 ANOUSHKA SHARM

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!