యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC).. అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 153 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు జనవరి 20 వరకు ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 21 నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు:
మొత్తం ఖాళీలు- 153
సంస్థ- యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC)
పోస్ట్ పేరు- అప్రెంటిస్
విద్యార్హత: ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
వయస్సు (01.12.2025 నాటికి) : అభ్యర్థుల వయస్సు 21 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
శిక్షణా సమయం: ఏడాది పాటు అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు.
పని అనుభవం: గతంలో అప్రెంటిస్ చేసిన వారు లేదా ఒక సంవత్సరం కంటే ఎక్కువ పని అనుభవం ఉన్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు కారు.
చివరి తేదీ: అర్హత కలిగిన అభ్యర్థులు జనవరి 20, 2026 వరకు అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: అభ్యర్థులను వారి డిగ్రీ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా తుది ఎంపిక జరుగుతుంది.
అప్లికేషన్ ప్రక్రియ:
అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ప్రొఫైల్‌ను 100% పూర్తి చేసిన తర్వాత, UIIC అప్రెంటిస్ పోస్టుల కోసం అప్లై చేయాలి.
NATS పోర్టల్ రిజిస్ట్రేషన్ :
1.మొదట NATS(https://nats.education.gov.in/) అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అవ్వాలి.
- తర్వాత హోమ్ పేజీలో ‘Student’ట్యాబ్‌ను ఎంచుకుని, ‘Student Register’పై క్లిక్ చేయండి.
3.అనంతరం మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడిని ఎంటర్ చేయండి.
4.OTP వెరిఫికేషన్: మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడికి వచ్చే OTPలను ఎంటర్ చేసి వెరిఫై చేయండి.
- రిజిస్ట్రేషన్ తర్వాత లాగిన్ అయి అవసరం అయిన వివరాలను జాగ్రత్తగా ఎంటర్ చేయండి. తర్వాత ఫోటో, సంతకాన్ని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
- ఎస్టాబ్లిష్‌మెంట్ సెర్చ్: మీ ప్రొఫైల్ 100% పూర్తయిన తర్వాత.. డ్యాష్‌బోర్డ్‌లో ‘Apply for Training’ లేదా ‘Establishment Search’ ఆప్షన్‌కు వెళ్ళండి.
- అక్కడ “UNITED INDIA INSURANCE CO.LTD” అని సెర్చ్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ కనిపిస్తుంది. దాని పక్కన ఉన్న ‘Apply’ బటన్ క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.
రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన డాక్యుమెంట్స్:
ఆధార్ కార్డ్.
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో.
స్టడీ సర్టిఫికెట్స్ (డిగ్రీ ప్రొవిజనల్/కాన్వొకేషన్).
బ్యాంక్ పాస్‌బుక్ మొదటి పేజీ స్కాన్ కాపీ.
ఈమెయిల్ ఐడి.
మొబైల్ నంబర్.





