HomeADMISSIONSయూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల

యూనివర్సిటీ గ్రాండ్స్ కమిషన్ నేషనల్ ఎలిజిలిటీ టెస్ట్ జూన్ 2026 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు అంతే కాకుండా పీహెచ్డీ అడ్మిషన్లకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్ 22 నుంచి 30వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ వెల్లడించింది. 85 సబ్జెక్టులకు ఈ పరీక్షలను ఎన్టీఏ నిర్వహించనుంది. ఆన్లైన్‌ లో మే 20వ తేదీ వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

అర్హత: అభ్యర్థులు 55 శాతం మార్కులతో డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ,ఎస్సీ, ఎస్టీ,దివ్యాంగులు, థర్డ్ జెండర్స్ కేటగిరీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

వయస్సు: జేఆర్ఎఫ్‌కు 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ,పీహెచ్డీ ప్రవేశాలకు గరిష్ట వయో పరిమితి లేదు.

అప్లికేషన్ ఫీజు:
జనరల్ అన్ రిజర్వ్డ్ అభ్యర్థులు రూ.1150 జనరల్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎస్ సీఎల్ రూ. 600.. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు థర్డ్ జెండర్స్‌ రూ.325 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

ఆన్ లైన్ అప్లికేషన్లకు చివరి తేదీ: మే 20 వరకు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఎడిట్ అవకాశం: మే 22 నుంచి 24 వరకు అప్లికేషన్లు ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
పరీక్ష తేదీలు: జూన్ 22 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

RELATED ARTICLES
WhatsApp Icon
JOIN OUR
WHATSAPP GROUP
CLICK THIS LINK
PRACTICE TEST
TELANGANA HISTORY
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

TELANGANA MAGAZINE

తెలంగాణ మాస పత్రిక (TELANGANA MONTHLY MAGAZINE) ప్రతి నెలా ఇక్కడ అందుబాటులో ఉంటుంది.

TELANGANA MAGAZINE SEPTEMBER 2025

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here