HomeLATESTయూజీసీ నెట్​ జూన్​ 2023.. మే 31 వరకు అప్లికేషన్లు

యూజీసీ నెట్​ జూన్​ 2023.. మే 31 వరకు అప్లికేషన్లు

UGC NET 2023 పరీక్ష షెడ్యూల్‌ విడుదలైంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్‌ 2023 ఎగ్జామ్​కు సంబంధించి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. మే 10 నుంచి మే 31 వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లికేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్ ఎగ్జామ్ నిర్వహించే బాధ్యతను యూజీసీ NTA కు అప్పగించింది. యూనివర్సిటీల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు, జూనియర్‌ రీసెర్చ్​ ఫెలోషిప్‌కు పోటీపడేందుకు పీజీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఈ పరీక్ష ఉపయోగపడుతుంది. మొత్తం 83 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. జూన్​ 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి.

Advertisement

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 10-05-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-05-2023.

పరీక్ష రుసుం చెల్లింపు చివరి తేదీ: 01-06-2023.

Advertisement

దరఖాస్తు సవరణ తేదీలు: 02-03 జూన్‌, 2023.

అప్లికేషన్లకు అఫిషియల్​ వెబ్​సైట్​ : https://ugcnet.nta.nic.in

అర్హత: 55% మార్కులతో పీజీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. 

Advertisement

వయోపరిమితి: జేఆర్‌ఎఫ్‌కు జూన్​ 30వ తేదీ నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1లో 50 ప్రశ్నలు… 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలు… 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్‌రిజర్వ్‌డ్‌కు రూ.1150; జనరల్- ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ- ఎన్‌సీఎల్‌ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్‌కు రూ.325.

Advertisement

పరీక్ష తేదీలు: జూన్​ 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు

READ MORE

UGC NET EXAM SYLLABUS

Advertisement

UGC NET PREVIOUS PAPERS

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!