దేశవ్యాప్తంగా డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)కు యూజీసీ నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(నెట్). నెట్ ఎలిజిబులిటీ సాధిస్తే.. దేశంలోని ఏ యూనివర్సిటీలోనైనా అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్‌కు పోటీ పడవచ్చు. జేఆర్ఎఫ్ సాధిస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అవసరమైన అర్హత సాధించటంతో పాటు మూడేళ్ల యూజీసీ ఫెలోషిప్ అందుకుంటారు. మొత్తం 81 సబ్జెకులలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.ప్రతి ఏడాది జూన్, డిసెంబర్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు 50 శాతం మార్కులు వస్తే చాలు. పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వారు నెట్ ఫలితాలు వెలువడ్డ ప్రకటించిన తేదీ నుంచి రెండేళ్లలోపు మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: జేఆర్ఎఫ్ అభ్యర్థులు 30 ఏళ్లకు మించకూడదు. రిజర్వుడ్ వర్గాలకు మేరకు వయోపరిమితిలో నిబంధనల ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు వయోపరిమితి లేదు.
పరీక్ష విధానం: కంప్యూటర్ ఆన్లైన్ టెస్ట్
పరీక్ష తేదీ: జూన్ 15 నుంచి 20 వరకు ( ఒకే రోజు రెండు పేపర్లు. ఉదయం 9.30 నుంచి 12.30, మధ్యాహ్నం 2.30 నుంచి గంటలు)
(కరోనా కారణంగా ఈసారి జూన్‌లో జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. పరీక్ష నిర్వహించే తదుపరి తేదీలను ఇంకా ప్రకటించలేదు.)
వివరాలకు: https://www.ugcnetonline.in/
గతంలో మూడు పేపర్లుండగా.. ఇప్పుడు మూడో పేపర్ ను రెండో పేపర్లో కలిపారు.
పేపర్-1: అన్ని సబ్జెక్టుల అభ్యర్థులకు ఈ పేపర్ కామన్. ఇందులో100 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నలన్నీ బోధన, పరిశోధన రంగాల్లో ప్రాధమిక పరిజ్ఞానాన్ని పరీక్షించేలా ఉంటాయి. రీజనింగ్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్, డైవర్జంట్ థింకింగ్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో ప్రశ్నలుంటాయి. పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు ఈ పేపర్ ఈజీగానే ఉంటుంది.
పేపర్- 2: ఇది పూర్తిగా అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టు పేపర్. ఇందులో 100 ప్రశ్నలుంటాయి. 200 మార్కులు. నెగెటివ్ మార్కులు లేవు.
This is complete guide book to National Eligibility Test (NET) Examination of University Grants Commission (UGC)
Conducted by National Testing Agency (NTA)
with a hope to serve as a complete online guide book for UGC NET Examination and give direction to you in a proper way. The solved papers given Here will help you to become aware of the format of the question papers. The solved question papers given in this website can also be treated as a sample copy. The aspirants can prepare the mock test out of the solved papers. The agencies that conduct seminar / workshop / training for their learners can download the materials given in this website for counseling purpose.