నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షలకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. డిసెంబర్ 31న జరగబోయే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల కోసం అధికారులు అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కేవలం డిసెంబర్ 31న జరిగే పరీక్షకు మాత్రమే ప్రస్తుతం అడ్మిట్ కార్డ్ విడుదల చేయగా.. మిగిలిన తేదీల్లో జరిగే పరీక్షల హాల్ టికెట్లు త్వరలోనే విడతల వారీగా అందుబాటులోకి రానున్నాయి.
పరీక్ష తేదీలు, అడ్మిట్ కార్డ్ సమాచారం:
యూజీసీనెట్ డిసెంబర్ సెషన్ పరీక్షలు 2025 డిసెంబర్ 31న ప్రారంభమై.. జనవరి 2, 3, 5, 6, 7 తేదీలలో జరగనున్నాయి.
అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేయడం ఎలా?
ముందుగా అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.nic.in లోకి లాగిన్ అవ్వాలి.
హోమ్‌పేజీలో ఉన్న “Candidate Activity” బోర్డు కింద “Admit card for UGC-NET December 2025” అనే లింక్‌పై క్లిక్ చేయండి.
మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ వివరాలను ఎంటర్ చేసి “Submit” బటన్ పై క్లిక్ చేయండి.
మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దానిని డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ అవుట్ తీసుకోండి.
సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి ?
అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నా లేదా అందులో తప్పుడు వివరాలు ఉన్నట్లు గమనించినా వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)ని సంప్రదించాలి.
ఫోన్ నంబర్: 011-40759000
ఈమెయిల్: ugcnet@nta.ac.in
ముఖ్య గమనిక:
పరీక్షా కేంద్రానికి వెళ్లేటప్పుడు అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా గుర్తింపు కార్డును (Aadhaar, PAN మొదలైనవి) వెంట తీసుకెళ్లడం మర్చిపోవద్దు.





