HomeLATESTయూజీసీ-నెట్ జూన్​ నోటిఫికేషన్​ రిలీజ్​

యూజీసీ-నెట్ జూన్​ నోటిఫికేషన్​ రిలీజ్​


దేశవ్యాప్తంగా సైన్స్‌, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్ఎఫ్, లెక్చర్‌షిప్‌ అర్హతకు నిర్వహించే సీఎస్‌ఐఆర్‌ యూజీసీ-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) ప్రకటనను నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుద‌ల చేసింది.

Advertisement


యూనివర్శిటీలు, కాలేజీల్లో అధ్యాపకులుగా కెరీర్ ప్రారంభించాలనుకునే వారి అర్హతను, అభిరుచిని నిర్దేశించే పరీక్ష యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్-నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (యూజీసీ నెట్‍). ఏటా జూన్, డిసెంబర్ నెలల్లో రెండు సార్లు దీనిని నిర్వహిస్తారు. తాజాగా జూన్ సెషన్ నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) విడుదల చేసింది. ఇందులో క్వాలిఫై అయితే హ్యూమానిటీస్‍, సైన్స్, సోషల్ సైన్సెస్‍, లాంగ్వేజస్ విభాగాల్లోని 100కు పైగా సబ్జెక్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్‌గా కెరీర్ ప్రారంభించడమే కాక జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా పరిశోధనలు చేసి పీహెచ్‌డీ, ఎంఫిల్ చేసే అవకాశం లభిస్తుంది.


నెట్ బెనిఫిట్స్​
నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు విశ్వవిద్యాలయాలు, డిగ్రీ, పీజీ కాలేజీల్లో జూనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ లెవెల్‌లో కెరీర్ ప్రారంభించవచ్చు. ఈ సమయంలోనే యావరేజ్ శాలరీ సంవత్సరానికి ఆరు లక్షల వరకు ఉంటుంది. ఆ తర్వాత పనితీరు ఆధారంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా ప్రమోషన్లు లభిస్తాయి. ఈ దశలో దాదాపు రూ.15 నుంచి రూ.20 లక్షల వేతనాలు అందుకోవచ్చు. ఫుల్‌టైమ్ టీచింగ్ కెరీర్ కాకుండా డిఫరెంట్ గా ఆలోచించేవారు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ఆథర్, గెస్ట్ ఫ్యాకల్టీ, కన్సల్టెంట్, ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ ట్యూటర్, ట్రాన్స్‌మిషన్ ఎగ్జిక్యూటివ్, ల్యాబ్ ట్రైనర్ వంటి పోస్టులను ఎంపిక చేసుకోవచ్చు. అయితే వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కి వచ్చినంత వేతనాలు అందకపోవచ్చు. వీటితో పాటు ప్రభుత్వ రంగంలోని మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు నెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసి రిక్రూట్ చేసుకుంటాయి. యూజీసీ కింద పనిచేసే ల్యాబోరేటరీలు, ఇతర ఇండస్ర్టీలు నెట్ క్వాలిఫైడ్ వారిని మాత్రమే నియమించుకుంటున్నాయి. జేఆర్‌ఎఫ్ క్వాలిఫై అయినవారు యూనివర్శిటీల్లో మూడేళ్లపాటు జూనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేయాలి. అనంతరం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా ప్రమోషన్ వస్తుంది. దీంతో ఎంఫిల్, పీహెచ్‌డీ చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నెలకు జేఆర్‍ఎఫ్‍కు రూ.31, ఎస్‍ఆర్‍ఎఫ్‍కు రూ.35 వేల ఫెలోషిప్ లభిస్తుంది.

పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్ సైన్సెస్, ఎర్త్, అట్మాస్ఫిరిక్, ఓషన్ అండ్ ప్లానిటరీ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, మ్యాథమేటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్.

Advertisement


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎంఎస్సీ/ ఇంటిగ్రేటెడ్ బీఎస్ఎంఎస్/ నాలుగేళ్ల బీఎస్/ బీఈ/ బీటెక్/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.


వయసు: జేఆర్ఎఫ్ అభ్యర్థులు 1 జులై 2021 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. లెక్చర్‌షిప్‌ (ఎల్‌ఎస్‌)/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు వయసుతో సంబంధం లేదు.


సెలెక్షన్​ ప్రాసెస్​: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్) ఆధారంగా ఎంపిక చేస్తారు.

Advertisement


ఎగ్జామ్​ ప్యాటర్న్​: కంప్యూటర్‌ బేస్డ్‌ పద్ధతిలో (సీబీటీ) నిర్వహిస్తారు. దీనిలో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌ ఏ, పార్ట్‌ బి, పార్ట్‌ సీ విభాగాల నుంచి ఆబ్జెక్టివ్‌ పద్ధతిలో ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్షని హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో నిర్వహిస్తారు.


దరఖాస్తులు: ఆన్‌లైన్​లో అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు: జనరల్‌ అభ్యర్థులు రూ.1000, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Advertisement


చివరి తేది: 2 జనవరి 2022
ఎగ్జామ్​: 29 జనవరి 2022, 5, 6 ఫిబ్రవరి.
వెబ్​సైట్​: www.csirnet.nta.nic.in

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!