HomeLATESTనిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ

నిఫ్ట్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ


నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ఉన్న క్యాంపస్​లలో యూజీ, పీజీ, పీహెచ్​డీ కోర్సుల్లో అడ్మిషన్స్​కు అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


బ్యాచిలర్‌ కోర్సులు (బి.డిజైన్‌): యాక్ససరీస్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌


అర్హత: ఇంటర్​ పాస్​ అవ్వాలి.


వయసు: 1 ఆగస్టు 2022 నాటికి 24 ఏండ్లకు మించకూడదు.

Advertisement


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష – (క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌(సీఏటీ), జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ)లో అర్హత సాధించిన అభ్యర్థుల్ని సిచువేషన్‌ టెస్ట్‌కి సెలెక్ట్​ చేస్తారు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌): అపెరల్‌ ప్రొడక్షన్‌


అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

Advertisement


వయసు: 1 ఆగస్టు 2022 నాటికి 24 ఏండ్లకు మించరాదు.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష (జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (జీఏటీ) ఆధారంగా ఎంపిక.


మాస్టర్స్‌ ప్రోగ్రామ్స్​: మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌

Advertisement


అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయసుతో సంబంధం లేదు.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష (క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌, జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థుల్ని షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది.


డాక్టోరల్‌ కోర్సులు

Advertisement


అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక.


దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.
చివరి తేది: యూజీ/ పీజీ కోర్సులకు జనవరి మొదటి వారం.
వెబ్​సైట్: www.nift.ac.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!