ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీబీ) బాంబే- డిజైన్ కోర్సుల్లో అడ్మిషన్స్‌కు ఉద్దేశించిన ‘అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఫర్ డిజైన్ (UCEED 2025) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఐఐటీ (హైదరాబాద్, బాంబే, దిల్లీ, గువాహటి, రూర్కీ), ఐఐఐటీడీఎం (జబల్పూర్) సహా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైన్ ఇన్‌స్టిట్యూట్‌లలో బీడిజైన్ కోర్సు చేసే అవకాశం ఉంటుంది.
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్/ కామర్స్/ ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపీసీ గ్రూప్ చదివినవారుపై 5 విద్యాసంస్థల్లో చేరొచ్చు. ఐఐఐటీడీఎంలో ప్రవేశానికి బైపీసీ అభ్యర్థులు కూడా అర్హులే. బైపీసీ సహా ఆర్ట్స్, కామర్స్ గ్రూప్‌లు చదివినవారు ఐఐటీ (హైదరాబాద్, బాంబే, దిల్లీ)లో చేరవచ్చు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ నిర్వహించే రెండేళ్ల జాయింట్ సర్వీసెస్ వింగ్ కోర్సు పూర్తిచేసినవారు; నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్(ఎన్‌ఐఓఎస్) నిర్వహించే సీనియర్ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులు అర్హులే. ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు 2000 అక్టోబర్ 1 లేదా ఆ తర్వాత జన్మించి ఉండాలి. దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్స్: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జనవరి 19న నిర్వహిస్తారు. ఫలితాలు మార్చి 7న ప్రకటిస్తారు. పూర్తి వివరాలకు www.uceed.iitb.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.