ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ బాంబే.. డిజైన్ కోర్సుల్లో ప్రవేశానికి UCEED-2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఎంట్రెన్స్ ద్వారా ఐఐటీ హైదరాబాద్, బాంబే, ఢిల్లీ, గువాహటి, రూర్కీ, ఇండోర్ సహా దేశవ్యాప్తంగా ఉన్న డిజైన్ ఇనిస్టిట్యూట్లలో డిజైన్ కోర్సులో చేరవచ్చు. ఇంటర్పాసైన వారు లేదా ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ అక్టోబర్ 31లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అర్హతలు
ఇంటర్ రెగ్యూలర్ స్టూడెంట్స్తో పాటు ఓపెన్ ఇంటర్ చదివిన వారు ఈ కోర్సులో చేరేందుకు అర్హులు. ఎంపీసీ గ్రూప్ చదివిన వారికి ప్రముఖ విద్యాసంస్థల్లో ప్రయారిటీ ఉంటుంది. వయసు 01–10–2001 తర్వాత జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్ ఉంటే సడలింపు ఉంటుంది.
సీట్లు వివరాలు
ఐఐటీ హైదరాబాద్–30 సీట్లు
ఐఐటీ బాంబే–37 సీట్లు
ఐఐటీ ఢిల్లీ –20 సీట్లు
ఐఐటీ ఇండోర్–16 సీట్లు
ఐఐటీ రూర్కీ-20 సీట్లు
ఐఐటీ జబల్పూర్-66 సీట్లు
ఐఐటీ గువాహటి–56 సీట్లు
మొత్తం సీట్లు–245
దరఖాస్తు వివరాలు
- * ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది. అక్టోబర్ 31,
* లేట్ ఫీ తో నవంబర్ 07వరకు అప్లై చేయవచ్చు.
* అడ్మిట్ కార్డులు జనవరి 02 నుంచి అందుబాటులో ఉంటాయి.
* పరీక్ష జనవరి 18న నిర్వహిస్తారు.
* ఫలితాలు మార్చి 06న విడుదల చేస్తారు. .





