తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో 2022–23 అకడమిక్ ఇయర్‌కు డిగ్రీ ఫస్టియర్‌లో అడ్మిషన్లకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. తెలంగాణ గురుకుల అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ యుజి సెంట్ ఎంట్రన్స్ టెస్ట్)కు అప్లికేషన్ గడువును ఈనెల 19వ తేదీ వరకూ పొడిగించినట్టు టీఎస్ డబ్లూఆర్ఈఐఎస్ కార్యదర్శి రోనాల్డ్ రాస్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీఏ, బీకాం, బీబీఏ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్స్ కోసం ఈ ఎంటన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు.
ఆన్లైన్లో అప్లికేషన్.. జనవరి 19 చివరితేది
2022,2023 విద్యా సంవత్సరానికి తెలంగాణ సొషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఫర్ వుమెన్ అండ్ మెన్ కాలజీల్లో ప్రవేశాలకు ఈ టెస్ట్ నిర్వహిస్తారు. కాగా ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 10వ తేదీతో గడువు ముగియనుంది. కానీ విద్యార్ధుల సౌకర్యం కోస గడువు తేదీని ఈ నెల 19వ తేదీ వరకూ పెంచినట్టు ఆయన తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వరా తమ దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వెబ్సైట్: www.tgtwgurukulam.telangana.gov.in
టీజీ యూజీ సెట్ ఎంట్రన్స్ గడువు పొడిగింపు
RELATED ARTICLES
PRACTICE TEST
CURRENT AFFAIRS