టీఎస్ టెట్ –2022లో పేపర్–1, పేపర్–2 రాసేందుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు విద్యాశాఖ గతంలోనే విడుదల చేసింది. అయితే పేపర్–1 కు దరఖాస్తు చేసుకున్న 3.5లక్షల మందికి కామన్ పేపర్ ఉంటుంది. కానీ పేపర్–2 రాసే అభ్యర్థుల్లో సైన్స్ & మ్యాథ్స్, సోషల్ స్టడీస్ అభ్యర్థులున్నారు. వీరిలో ఏ సబ్జెక్ట్‌కు ఎంత మంది రాస్తున్నారు? కాంపిటీషన్ ఎట్లా ఉంటుందనే ఆసక్తి అభ్యర్థుల్లో ఉంటుంది. ఇందుకోసం పేపర్–2 రాసే అభ్యర్థులు వివరాలు సబ్జెక్ట్ వారీగా అందిస్తున్నాం.
పేపర్–1 తెలుగు మీడియంలో 3,26,288 మంది, బెంగాళీ,గుజరాత్ భాషలో రాసేందుకు 15 మంది, హిందీలో 10054, కన్నడలో 375, మరాఠీ, తమిళ్ భాషలో రాసేందుకు 300, ఉర్దూలో రాసేందుకు 14436 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
పేపర్–2 మ్యాథమేటిక్స్&సైన్స్ తెలుగు మీడియంలో రాసేందుకు 1,39,492, ఉర్దూలో 4820, హిందీలో 4847, కన్నడ 78, మరాఠీ 41, తమిల్ 15, సంస్కృతంలో రాసేందుకు 17 మంది దరఖాస్తు చేసుకున్నారు.
పేపర్–2 సోషల్ స్టడీస్ తెలుగు మీడియంలో రాసేందుకు 2,45,698 మంది, ఉర్దూలో 5852, హిందీలో 16157, కన్నడ 164, మరాఠీ 104, తమిళ్ 10, సంస్కృతంలో రాసేందుకు 81 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
TSTET 2022 SUBJECT WISE DETAILS (మొత్తం వివరాలు)
పేపర్–1 | మొత్తం అప్లికేషన్లు | 3,51,468 | |
పేపర్–2 | మ్యాథ్స్&సైన్స్ | 1,49,310 | |
పేపర్–2 | సోషల్ స్టడీస్ | 1,28,574 | |
పేపర్–2 | మొత్తం అప్లికేషన్లు | 2,77,884 |
TET