టెట్ 2022 (TSTET 2022) దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. రాబోయే డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీతో పాటు ప్రస్తుతం టెట్ అప్లికేషన్ సబ్మిషన్లో భాగంగా గతంలో రాసిన టెట్‌లో అత్యధిక మార్కులు సాధించిన టెట్ హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేసేందుకు ప్రత్యేక కాలంను వెబ్సైట్లో రూపొందించారు. అయితే.. చాలా మంది అభ్యర్థుల దగ్గర పాత టెట్ హాల్ టికెట్లు అందుబాటులో లేకపోవడంతో దరఖాస్తు చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటివరకు కేవలం 12వేల మంది మాత్రమే అప్లై చేసుకోగా ఇంకా దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది. దీంతో డీఈడీ, బీఈడీ అభ్యర్థులు టెట్ అధికారులను కలిసి పాత హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని కోరారు. ఈ మేరకు టెట్ వెబ్సైట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 నుంచి 2014 వరకు నిర్వహించిన 4 టెట్లతో పాటు తెలంగాణ ఏర్పాటైన తర్వాత నిర్వహించిన 2 టెట్‌లకు సంబంధించిన అభ్యర్థుల హాల్ టికెట్లను టీఎస్ టెట్ వెబ్‌సైట్ www.tstet.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరిచారు.
అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేది లేదా టెట్ అప్లికైషన్ ఐడీ నంబర్ ఎంట్రీ చేస్తే హాల్ టికెట్లు డౌన్చేసుకునేలా అవకాశం కల్పించారు. టెట్ అప్లికేషన్ ఫారంలో అభ్యర్థి ఎక్కువ మార్కులు సాధించిన టెట్‌కు సంబంధించి హాల్ టికెట్ నంబర్ ఎంట్రీ చేస్తే మార్కులు కనిపిస్తాయి. ప్రస్తుతం నిర్వహించే టెట్‌లో సాధించిన మార్కులను బట్టి దేనిలో ఎక్కువ వస్తే వాటిని డీఎస్సీలో 20 శాతం వెయిటేజికి కలుపుతారు.
హాల్ టికెట్ల కోసం..
www.tstet.cgg.gov.in
రిజల్ట్స్ కోసం.. www.manabadi.co.in/sourceview/APTET/Results/results-list
For any Technical problems in Online Application Submission and Download of Hall-Tickets (THIS IS TSTET OFFICIAL NOTE)
Call Ph:040-23120340, 040-23120433
(Call Time: 10.10 A.M to 1.00 P.M &
1.20 P.M to 05.20 P.M on working days)